మెగాస్టార్ చిరంజీవి హీరో గా త్రిష హీరోయిన్ గా మల్లాడి వశిష్ట దర్శకత్వంలో ప్రస్తుతం విశ్వంభర అనే భారీ బడ్జెట్ మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ సినిమాకి ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తూ ఉండగా ... ఈ మూవీ ని తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు సంపాదించుకున్న నిర్మాతలు అయినటువంటి వంశీ , ప్రమోద్ యు వి క్రియేషన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. 

ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భం గా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు . ఇక పోతే ఈ సినిమాలో చాలా మంది తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ ఉన్న నటీ మణులు కీలక పాత్ర లో కనిపించబోతున్నట్లు అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే నా సామి రంగ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఆషికా రంగనాథ్ కూడా ఈ మూవీ లో కనిపించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతున్న విషయం మనకు తెలిసిందే . తాజా గా ఈ సినిమాలో ఈ ముద్దు గుమ్మకు సంబంధించిన కీలక అప్డేట్ ను ఈ మూవీ బృందం వారు విడుదల చేశారు.

తాజాగా మేకర్స్ ఆశికా రంగనాథ్ "విశ్వంబర" సినిమాలో నటించబోతున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఇకపోతే ఇప్పటికే నా సామి రంగ సినిమాలో హీరోయిన్ గా నటించి తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టి పడేసిన ఆశిక విశ్వంబర సినిమాలో కూడా అవకాశాన్ని దక్కించుకుంది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించినట్లు అయితే ఈ బ్యూటీ కి మరిన్ని తెలుగు సినిమాల్లో అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: