మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి కాజల్ అగర్వాల్ కొంత కాలం క్రితం బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన భగవంత్ కేసరి అనే పవర్ఫుల్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో బాలయ్య కు జోడి గా నటించింది. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఇక పెళ్లి తర్వాత కాజల్ కి తెలుగు లో భగవంత్ కేసరి మూవీ తోనే మంచి కమర్షియల్ విజయం దక్కింది. పెళ్లి తర్వాత మంచి విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీ తాజాగా సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది.

సుమన్ చిక్కాల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నవీన్ చంద్ర ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ ని మొదట మే 31 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ సినిమాకి సంబంధించిన కొన్ని పనులు పెండింగ్ ఉండడంతో ఈ సినిమా విడుదల తేదీన వాయిదా వేశారు. ఈ మూవీ ని వచ్చే నెల అనగా జూన్ 7 వ తేదీన విడుదల చేయనున్నట్లు కొత్త విడుదల తేదీని మేకర్స్ నిన్న ప్రకటించారు. ఇకపోతే ఈ మూవీ ట్రైలర్ ను ఈ రోజు విడుదల చేయనున్నట్లు మేకర్స్ రెండు రోజుల ముందే ప్రకటించారు.

అలాగే ఈ సినిమా ట్రైలర్ ను బాలకృష్ణ విడుదల చేయనున్నట్లు కూడా మేకర్స్ ప్రకటించారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క ట్రైలర్ ను ఈ రోజు రాత్రి 8 గంటల 01 నిమిషానికి బాలకృష్ణ చేతుల మీదుగా విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. మరి ఈ మూవీ తో కాజల్ ఏ స్థాయి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: