కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో కార్తీ ఒకరు. ఈయన కొంత కాలం క్రితం జపాన్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో అను ఇమ్మాన్యూయల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మంచి అంచనాల నడుమ ఒకే సారి తమిళ్ మరియు తెలుగు భాషల్లో విడుదల అయ్యింది. ఈ మూవీ అటు తమిళ్ , ఇటు తెలుగు రెండు భాషల ప్రేక్షకులను కూడా ఆకట్టుకోలేకపోయింది. 

దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే తాజాగా కార్తీ తదుపరి మూవీ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. తాజాగా కార్తీ నెక్స్ట్ మూవీ కి సంబంధించిన పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఆ పోస్టర్ ప్రకారం కార్తీ హీరోగా రూపొందబోయే సినిమాకి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించబోతున్నాడు. తమిళ సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన నటలలో ఒకరు అయినటువంటి అరవింద స్వామి ఈ మూవీ లో ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ప్రొడక్షన్ నెంబర్ 22 గా రూపొందనున్న ఈ సినిమాను జ్యోతిక మరియు సూర్య నిర్మించబోతున్నారు. ఇక ఈ మూవీ నుండి ఈ రోజు 5 గంటలకు ఒక అప్డేట్ ను మరియు 7 గంటలకి ఒక అప్డేట్ ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

తాజాగా ఈ మూవీ బృందం వారు విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక జపాన్ మూవీ తో ప్రేక్షకులను నిరత్సాహ పరిచిన కార్తీ ఈ మూవీ తో కచ్చితంగా విజయాన్ని అందుకోవాలి అనే కసితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ కి సంబంధించిన మరిన్ని విషయాలు ఈ రోజు 5 మరియు 7 గంటలకు రాబోయే ప్రకటనలతో తెలిసే అవకాశం ఉంది. మరి ఈ రోజు ఈ చిత్ర బృందం ఎలాంటి అప్డేట్ లను ప్రకటిస్తుందో తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: