హీరోలకు ఉన్నంత లాంగ్ కెరియర్ హీరోయిన్లకు ఉండదు అనే విషయం మన అందరికీ తెలిసిందే. కానీ కొంత మంది హీరోయిన్లు మాత్రం చాలా సంవత్సరాల పాటు వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ ఇండస్ట్రీ లో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తూ ఉంటారు. అలాంటి వారు కొంత మంది తెలుగు సినీ పరిశ్రమలో కూడా ఉన్నారు. ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్ లు వచ్చి కొన్ని సినిమా అవకాశాలను దక్కించుకొని విజయాలను అందుకోవడంతోనే వీరు స్టార్ హీరోయిన్ లను తొక్కేసి వెళ్ళిపోతారు అని అంతా భావిస్తూ ఉంటారు. కానీ వారు ఒకటి , రెండు సినిమాల తర్వాత బారి సినిమాల అవకాశాలను దక్కించుకోకపోవడంతో వారు సీనియర్ హీరోయిన్లను దాటలేకపోతున్నారు.

సీనియర్ హీరోయిన్స్ మాత్రం సీనియర్ స్టార్ హీరోల సరసన నటిస్తూ , లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటిస్తూ తమ కెరియర్ ను జూనియర్ హీరోయిన్స్ కంటే కూడా మంచి స్థానంలో కొనసాగిస్తున్న కొంతమంది ఉన్నారు. ఇక తెలుగు సినీ పరిశ్రమలో చాలా సంవత్సరాలు స్టార్ హీరోయిన్ లుగా కెరియర్ ను కొనసాగించి ప్రస్తుతం కూడా వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటున్న ముద్దుగుమ్మలు కాజల్ అగర్వాల్ , తమన్నా , శృతి హాసన్ , సమంత , అనుష్క శెట్టి వీరు చాలా సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లుగా కెరియర్ ను కొనసాగించారు. ఆ తర్వాత కొత్త హీరోయిన్లు రావడంతో వీరు కనుమరుగైపోతారు అని అంతా అనుకున్నారు.

కానీ వీరు మాత్రం వరుస సినిమాలలో నటిస్తూనే వస్తున్నారు. కాజల్ కొన్ని రోజుల క్రితమే భగవంత్ కేసరి సినిమాలో నటించింది. తాజాగా సత్యభామ సినిమాలో నటించింది. ఈ మూవీ విడుదలకు రెడీగా ఉంది. ఇక తమన్నా కూడా వరుస సినిమాలలో నటిస్తూ వస్తోంది. కొన్ని రోజుల క్రితమే భోళా శంకర్ మూవీ తో ఈ బ్యూటీ ప్రేక్షకులను పలకరించింది. ఇక శృతి హాసన్ ఏకంగా పోయిన సంవత్సరం వీర సింహా రెడ్డి , వాల్టేరు వీరయ్య , హాయ్ నాన్న , సలార్ ఇలా నాలుగు మూవీ లతో ప్రేక్షకులను పలకరించింది. ఇకపోతే సమంత కొన్ని రోజుల క్రితమే శాకుంతలం , ఖుషి అనే మూవీ లతో ప్రేక్షకులను పలకరించింది. అనుష్క చాలా స్లో గా సినిమాలు చేస్తున్న వచ్చిన సినిమాతో మంచి ఇంపాక్ట్ ను చూపిస్తుంది. ఈమె కొన్ని రోజుల క్రితమే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ తో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని అందుకుంది. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఈ సీనియర్ హీరోయిన్ లు జూనియర్ హీరోయిన్ల కంటే ఎక్కువ అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: