యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమా చేయబోతున్నారనే ప్రకటన ntr పుట్టినరోజు సందర్భంగా వెలువడింది. ఎన్టీఆర్ ప్రస్తుతం "దేవర", "వార్ 2" చిత్రాల షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాల షూటింగ్ పూర్తి కాగానే, ఆగస్టులో ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ కాంబో మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ ఇద్దరి కాంబినేషన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రశాంత్‌ నీల్ కేజీఎఫ్ లాంటి ఇంటెన్స్ యాక్షన్ సినిమాలను ఇండియన్ ప్రేక్షకులకు అందించాడు. సలాడ్ సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అలాంటి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ బీభత్సమైన టాలెంట్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ తో చేతులు కలపడం వల్ల ఇప్పుడు హైట్స్ అనేవి తారా స్థాయికి చేరుకున్నాయి.

సినిమా స్టోరీ గురించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనలు రాలేదు, కానీ ఇది ఒక భారీ యాక్షన్ డ్రామాగా ఉంటుందని భావిస్తున్నారు. ntr గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించే అవకాశం ఉంది. ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా ప్రారంభం ఆలస్యం అయినప్పటికీ, అది అతని కెరీర్ లోనే అతిపెద్ద హిట్టు అవుతుందని తమకు ఫుల్ మీల్స్ అందిస్తుందని  అభిమానులు ఆశిస్తున్నారు. అయితే తాజా వార్తల ప్రకారం, చిత్ర నిర్మాతలు ఈ సినిమాలో నటించడానికి ప్రముఖ నటి రష్మిక మందన్నను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. రష్మిక మాతో పాన్ ఇండియా లెవెల్లో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది అనిమల్ సినిమాతో ఆమె క్రేజీ మరో లెవెల్ కి చేరుతుంది. ఈ నేషనల్ క్రష్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో రొమాన్స్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలని ఫ్యాన్స్ కూడా బాగా ఎగ్జైట్ అవుతున్నారు.

రష్మిక టాలెంట్, పెరుగుతున్న క్రేజ్ గుర్తించి, ఆమె ఈ పాత్రకు సరైన ఎంపిక అని చిత్ర బృందం భావిస్తోందట. ఈ ప్రాజెక్ట్ పట్ల ఆసక్తి పెంచుతూ, రష్మికతో చర్చలు ప్రారంభమైనట్లు సమాచారం. రష్మిక ఓకే చెప్పే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది ఒక పెద్ద ప్రాజెక్టు. సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువే.

మరింత సమాచారం తెలుసుకోండి: