డైరెక్టర్ శంకర్ చాలా సంవత్సరాల క్రితం ఇండియన్ అనే మూవీ ని రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా తమిళ్ లో ఇండియన్ అనే పేరుతో విడుదల కాగా తెలుగు లో భారతీయుడు అనే టైటిల్ తో విడుదల అయింది. ఈ సినిమా అటు కోలీవుడ్ , ఇటు టాలీవుడ్ రెండు ఇండస్ట్రీ లలో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ సినిమాలో కమల్ హాసన్ హీరోగా నటించాడు. కమల్ ఈ మూవీ లో రెండు విభిన్నమైన పాత్రలలో నటించి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు.

చాలా సంవత్సరాల తర్వాత దర్శకుడు శంకర్ "ఇండియన్" మూవీ కి కొనసాగింపుగా "ఇండియన్ 2" అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ మూవీ ని జూలై 12 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమాను తమిళ్ , తెలుగు , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఫంక్షన్ ను జూన్ 1 వ తేదీన భారీ ఎత్తున నిర్వహించనున్నారు.

అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలవడింది. ఇకపోతే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా చాలా గ్రాండ్ గా నిర్వహించాలని ఆ ఈవెంట్ కి అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న అనేక మంది సెలబ్రెటీలను తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను చెన్నై లో నిర్వహించనున్నట్లు దానికి టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి మెగాస్టార్ చిరంజీవి , గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హిందీ సినీ పరిశ్రమ నుండి యువ నటుడు రన్వీర్ సింగ్ , మలయాళ ఇండస్ట్రీ నుండి మోహన్ లాల్ ను తీసుకురావాలి అనే ఆలోచనలో మూవీ బృందం ఉన్నట్లు ప్రస్తుతం అందుకు సంబంధించిన సంప్రదింపులు జరుపుతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇలా ఒకే ఒక్క ఈవెంట్ తో ఇండియా వ్యాప్తంగా ఈ మూవీ యూనిట్ ప్రచారాలను చేయాలి అని భావిస్తున్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: