లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కాజల్ తన మొదటి సినిమా యావరేజ్ అయినప్పటికీ  రెండో సినిమా చందమామ తో సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలు చేసే ఛాన్స్ ను అందుకుంది. ఇక వరుస సినిమాలు చేసే సమయంలోనే తన చిన్నప్పటి స్నేహితుడైన గౌతం కిచ్లు ను పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని పండంటి మగ బిడ్డని జన్మనిచ్చింది. ఆ తర్వాత సినిమాలకు కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని భగవంత్ కేసరి సినిమాతో  రీ ఎంట్రీ ఇచ్చి మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది. 

దాని తర్వాత సుమన్ చిక్కాల దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ సత్యభామ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. క్రైమ్ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమాకి మేకర్స్ సత్యభామ అనే టైటిల్ ను లాక్ చేశారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ రిలీజ్ చేశారు. ఈ విషయం తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సరికొత్త పోస్టర్ ని సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. కాజల్ ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతోంది. అంతేకాకుండా నవీన్ చంద్ర

 కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను మేనేజర్ గూడచారి ఫేమ్ శశికిరణ్ తిక్క సమర్పిస్తున్నారు. అంతేకాకుండా బ్యానర్ పై ఔరుమ్ ఆర్ట్స్, బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కల పేల్లి కలిసి ఈ సినిమాను నేర్పిస్తున్నారు. ఈ సినిమాకి శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ ని అందిస్తున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక భగవంత్ కేసరి సినిమా తర్వాత కాజల్ అగర్వాల్ చేస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తన సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ అగర్వాల్ మొట్టమొదటిసారిగా చేస్తున్న లేడీ ఓరియంటెడ్ సినిమా ఇది..ఇకపోతే నందమూరి నటసింహం బాలకృష్ణ విడుదల చేసిన సత్యభామ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమ్ము లేపుతోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: