తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటులలో ఆనంద్ దేవరకొండ ఒకరు. ఈయన దొరసాని అనే వెండి తెరకు పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ లో తన మంచి నటనతో ఆనంద్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఈయనకు వరుసగా తెలుగు సినిమాల్లో హీరో గా అవకాశాలు దక్కాయి. ఆ తర్వాత ఈ నటుడు పలు సినిమాలలో నటించి మంచి విజయాలను అనుకున్నాడు. కొంత కాలం క్రితం ఈయన బేబీ అనే సినిమాలో హీరో గా నటించాడు.

మూవీ సూపర్ సక్సెస్ కావడంతో ఆనంద్ కి సూపర్ క్రేజ్ తెలుగు సినీ పరిశ్రమలో లభించింది. బేబీ లాంటి అద్భుతమైన విజయవంతమైన సినిమా తర్వాత ఆనంద్ "గం గం గణేశా" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందింది. ఈ సినిమాను మే 31 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తున్నారు తెలుస్తుంది.

అందులో భాగంగా ఈ మూవీ యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను మరో ఒకటి రెండు రోజుల్లో నిర్వహించనున్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు నేషనల్ క్రష్ రష్మిక మందన ను ముఖ్య అతిథిగా తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు , ఆల్మోస్ట్ ఈమె కూడా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు , అందుకు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్ కూడా మరో ఒకటి , రెండు రోజుల్లో రాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ad