1996 వ సంవత్సరం లోక నాయకుడు కమల్ హాసన్ హీరో గా శంకర్ దర్శకత్వం లో ఇండియన్ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా ... శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై ఏ ఎం రత్నం ఈ సినిమాను ఎంతో భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇకపోతే తమిళ్ లో ఇండియన్ అనే టైటిల్ తో రూపొంది విడుదల అయిన ఈ సినిమాను తెలుగు లో భారతీయుడు అనే టైటిల్ తో విడుదల చేశారు. ఇకపోతే ఈ సినిమా తమిళ్ లో ఏ స్థాయి విజయాన్ని అందుకుందో తెలుగు లో కూడా అదే రేంజ్ సక్సెస్ ను అందుకుంది. 

1996 వ సంవత్సరం విడుదల అయ్యి అద్భుతమైన విజయం అందుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బారి కలెక్షన్ లను వసూలు చేసిన ఈ సినిమాను తిరిగి మళ్ళీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయనున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేస్తుంది. ఈ మూవీ ని జూన్ 7 వ తేదీన గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ గా అవుతుంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ ల ట్రెండ్ జోరుగా కొనసాగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

అందులో భాగంగా ఇప్పటికే అనేక సినిమాలు రీ రిలీస్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లను రాబట్టాయి. మరి ఇండియన్ సినిమా కూడా అదే స్థాయిలో బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంపాక్ట్ ను చూపిస్తుందో లేదో తెలియాలి. ఇది ఇలా ఉంటే ఇండియన్ మూవీ కి కొనసాగింపుగా "ఇండియన్ 2" అనే మూవీ ని రూపొందించారు. ఆ మూవీ ని ప్రపంచ వ్యాప్తంగా జూలై 12 వ తేదీన తమిళ్ , తెలుగు , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: