నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి సినిమా ‘మనం’ విడుదలై 10 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా లేటెస్ట్ గా ఈ మూవీని రీ రిలీజ్ చేశారు. అయితే తెలుగు రాష్ట్రాలలోని అన్ని సేటర్స్ లో కాకుండా కేవలం హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం సెంటర్స్ లో మాత్రమే ఈ మూవీని రీ రిలీజ్ చేశారు.గత కొన్ని నెలలుగా సినిమా ధియేటర్లకు దూరంగా ఉంటున్న యూత్ ఈసినిమాను చూడటానికి దేవి 70 ఎంఎం ధియేటర్ కు రావడమే కాకుండా ఆ ధియేటర్ హౌస్ ఫుల్ గా మారడం చాలామందిని ఆశ్చర్య పరిచింది. అక్కినేని కుటుంబ హీరోల ఫ్యాన్స్ తో ధియేటర్ నిండిపోయింది. అభిమానుల మధ్య నాగచైతన్య అఖిల్ లు కలిసి కూర్చోవాడమే కాకుండా తమ ఫ్యాన్స్ చేస్తున్న సందడిని చైతూ అఖిల్ లు ఎంజాయ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.తమ తాత అక్కినేని నాగేశ్వరరావుతో అక్కినేని యంగ్ హీరోలు కలిసి నటించిన సీన్స్ వచ్చినప్పుడు నాగచైతన్య తన భావోద్వేగాన్ని ఆపుకోలేక కంట వస్తున్న కన్నీరు ను తుడుచుకున్న సందర్భాన్ని గమనించిన అక్కినేని ఫ్యాన్స్ మరింత హడావిడి చేశారు. గత కొంత కాలంగా వరస ఫ్లాపులతో సత్యమతమై పోతున్న నాగార్జున నాగచైతన్య అఖిల్ లకు ఊహించని ఈ ‘మనం’ మ్యానియా విపరీతమైన జోష్ ను ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.దేవి ధియేటర్ లో అక్కినేని అభిమానులు చేసిన విపరీతమైన అల్లరి చూసిన వారికి నాగచైతన్య టాప్ హీరోల లిస్టులో చేరకపోయినా  సరైన సినిమాలో ‘మనం’ లాంటి క్లాసిక్ మూవీని రీ రిలీజ్ చేసి అక్కినేని యంగ్ హీరోలు మరొకసారి సరైన కథతో ఒక మంచి సినిమాలో నటిస్తే వారికి ఎదురురుండదు అనుకోవాలి. ఇది ఇలా ఉంటే వరసపెట్టి సినిమా మాలను చేస్తూ తమ కుటుంబ హీరోల మార్కెట్ తగ్గిపోకుండా నాగ్ ఆదేవిధంగా చైతూ అఖిల్ లు ‘మనం’ సినిమాను చాల తెలివిగా ఉపయోగించుకుంటున్నారు అని అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: