రాజమౌళిని ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరు గౌరవిస్తారు. దానికి తగ్గట్టుగానే జక్కన్న కూడ వివాదాలకు చాల దూరంగా ఉంటాడు. అలాంటి రాజమౌళి పై ప్రముఖ సినీ గేయ రచయిత స్వర్గీయ సిరివెన్నెల సీతారామ శాస్త్రి అసహనాన్ని వ్యక్తం చేసిన సందర్భం ఒకటి ఉంది.స్వయంగా ఈవిషయాన్ని సీతారామ శాస్త్రిని గుర్తుకు చేసుకుంటూ ఒక ప్రముఖ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న రాజమౌళి సీతారామ శాస్త్రీ తన పై చూపెట్టిన అసహనాన్ని గుర్తుకు చేసుకున్నాడు. తమ కుటుంబ సభ్యులందరికీ సీతారామ శాస్త్రి అంటే విపరీతమైన గౌరవం అంటూ తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ రచయితగా ఫ్లాప్ లలో కొనసాగుతున్నప్పుడు సీతారామ శాస్త్రీ ‘ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి’ అంటూ తన తండ్రికి ఒక పాట వ్రాసి ఇచ్చిన తరువాత ఆపాట స్పూర్తితో తిరిగి తన తండ్రి వరసపెట్టి సినిమా కథలను వ్రాసి బిజీ అయిన సందర్భాన్ని గుర్తుకు చేసుకున్నాడు.ఆ అనుబంధంతో తాను తీసిన ప్రతి సినిమాలోనూ సరివెన్నెల పాట ఉండేలా తాను చూసుకునే వాడినని అంటూ సిరివెన్నెల తో తనకు ఏర్పడ్డ ఆ బంధాన్ని గుర్తుకు చేసుకున్నాడు. తనకు కర్ణాటకా ప్రభుత్వ కోటాలో తనకు పద్మశ్రీ వచ్చినప్పుడు ఆబిరుదు పై తనకు ప్రత్యేకంగా ఆశక్తి లేకపోవడంతో తాను ఆ గౌరవాన్ని అందుకోవడానికి తాను ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లకూడదు అని అప్పట్లో తనకు వచ్చిన ఆలోచనలు తాను గురువుగా సిరివెన్నెల దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు తన పై సిరివెన్నెలకు విపరీతమైన కోపం రావడమే కాకుండా ప్రభుత్వ శతారాలను తిరస్కరించడం గౌరవం కాదనీ అది ఒక గొప్ప వ్యక్తి వ్యక్తిత్వం పై నెగిటివ్ ప్రభావాన్ని చూపెడుతుంది అంటూ సిరివెన్నెల తనకు క్లాసు పీకడంతో తాను సిరివెన్నెల మాటకు గౌరవించి ఢిల్లీ వెళ్ళిన సందర్భాన్ని గుర్తుకు చేసుకున్నాడు.  అప్పటి నుండి తనకు సిరివెన్నెల అంటే ప్రేమ అభిమానంతో పాటు గౌరవం కూడ తనకు ఎక్కువ అంటూ కొన్ని ఆశక్తికర కామెంట్స్ చేశాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: