మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన మలయాళ నటుడే అయినప్పటికీ ఇండియాలోని అనేక భాష లలో ఇప్పటికే సినిమాలు చేసి ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నా డు . ఇది ఇలా ఉంటే దుల్కర్ ఇప్పటికే కొన్ని తెలుగు సినిమాలలో నటించి వాటితో మంచి విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈయన మహానటి అనే తెలుగు సినిమాలో కీలకమైన పాత్రలో నటించి మంచి విజయాన్ని అందుకొని సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఆ తరువాత ఈ నటుడి సీత రామం అనే మరో తెలుగు సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కూడా సూపర్ సక్సెస్ కావడంతో ఈయన క్రేజ్ తెలుగులో మరింత గా పెరిగి పోయింది. 

ఇలా ఇప్పటికే రెండు తెలుగు మూవీ లతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న దుల్కర్ మూడోసారి మరో స్టేట్ తెలుగు సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈయన వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న లక్కీ భాస్కర్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చాలా వరకు పూర్తి అయింది. ఇకపోతే ఈ సినిమాను సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక దుల్కర్ ఇప్పటికే తెలుగులో నటించిన మహానటి , సీత రామం సినిమాలు మంచి విజయాలను అందుకొని ఉండడంతో ఈయన నటిస్తున్న లక్కీ భాస్కర్ మూవీ పై ప్రస్తుతం ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ds