టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి అల్లరి నరేష్ ఈ మధ్య కాలంలో సినిమాల స్పీడ్ ను ఫుల్ గా పెంచాడు. ఈ నటుడు కెరియర్ ను మొదలు పెట్టిన చాలా సంవత్సరాల పాటు ఎక్కువ శాతం కామెడీ ప్రాధాన్యత ఎక్కువ ఉన్న సినిమాల పైనే ఫుల్ ఫోకస్ పెట్టాడు. ఇకపోతే అందులో భాగంగా ఈయన సుడిగాడు మూవీ తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు.

మూవీ తర్వాత నరేష్ ఎన్ని కామెడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించిన ఏ మూవీ కూడా సుడిగాడు స్థాయి విజయాన్ని మాత్రం ఆదుకోలేదు. అలాగే యావరేజ్ విజయాలను కూడా అందుకోలేదు. అలాంటి సమయం లోనే ఈయన నాంది అనే మూవీ తో తన రూటును పూర్తిగా మార్చారు. ఇక వరుసగా సీరియస్ పాత్రలలో నటిస్తూ వస్తున్న అల్లరి నరేష్ కొన్ని రోజుల క్రితమే ఆ ఒక్కటి అడక్కు అని ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా లో హీరో గా నటించాడు. కానీ ఈ మూవీ కూడా నరేష్ కు మంచి విజయాన్ని అందించలేదు. ఇకపోతే ప్రస్తుతం ఈయన బుచ్చల మల్లి అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.

మూవీ లో కూడా నరేష్ పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. తాజాగా బచ్చల మల్లి ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయగా దానికి ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది. ఇకపోతే తాజాగా నరేష్ ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన బ్యానర్ లలో ఒకటి అయినటువంటి సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో తన తదుపరి మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథ చర్చలు కూడా పూర్తి అయినట్లు ఈ మూవీ ని మెహర్ తేజ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించనున్నట్లు , మరి కొద్ది రోజుల్లోనే ఈ మూవీ కి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు రాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

an