కొంత కాలం క్రితమే గామి అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకొని ఫుల్ జోష్ లో ఉన్న విశ్వక్ సేన్ తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ లో నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా ... అంజలి ఓ కీలకమైన పాత్రలో నటించింది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ మే 31 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది.

విడుదల అయిన మొదటి రోజే ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర కాస్త మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ ఈ మూవీ మంచి కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇకపోతే ఈ మూవీ పర్వాలేదు అనే స్థాయిలో కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది. ఈ మూవీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సమయం లోనే ఈ మూవీ ని జూన్ 14 వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈ సంస్థ వారు అధికారికంగా ప్రకటించారు.

దీనితో ఈ సినిమా కలెక్షన్లు చాలా వరకు తగ్గాయి. ఇకపోతే తాజాగా ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ తెలుగు తమిళ కన్నడ మలయాళం భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది. ఎవరైనా ఈ సినిమాను థియేటర్లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ ఓ టి టి లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి. బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో భారీగా సక్సెస్ కాలేకపోయినా ఈ సినిమా ఓ టి టి ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

vs