విక్టరీ వెంకటేష్ ఆఖరుగా సైంధవ్ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. కానీ ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది. ఇకపోతే చాలా రోజుల క్రితమే వెంకటేష్ హీరో గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మాణంలో ఓ మూవీ అనౌన్స్మెంట్ వచ్చిన విషయం మనకు తెలిసిందే. 

మూవీ వెంకటేష్ కెరియర్ లో 76 వ మూవీ గా రూపొందనున్న నేపథ్యంలో ఈ సినిమాకు మేకర్స్ టైటిల్ ఫిక్స్ చేయకపోవడంతో వెంకీ 76 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాకు సంబంధించిన పనులను ఈ చిత్ర బృందం వారు మొదలు పెట్టారు. ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించిన కథను లాక్ చేసినట్టు తెలుస్తోంది. మూవీ స్టోరీ లాక్ కావడంతో ప్రస్తుతం వైజాగ్ లో ఈ చిత్రానికి సంబంధించిన ఫైనల్ డైలాగ్ వెర్షన్ ను అనిల్ రావిపూడి రెడీ చేస్తున్నట్లు సమాచారం.

ఇక ఈ డైలాగ్ వెర్షన్ కూడా మరికొన్ని రోజుల్లోనే కంప్లీట్ కాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఇప్పటికే స్టోరీ లాక్ కావడం , డైలాగ్ వెర్షన్ కూడా చివరి దశకు రావడంతో ఈ మూవీ యొక్క షూటింగ్ ను మరికొన్ని రోజుల్లోనే మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం వారు ఉన్నారు. ఇప్పటికే వెంకటేష్ , అనిల్ రావిపూడి , దిల్ రాజు కాంబినేషన్ లో ఎఫ్ 2 , ఎఫ్ 3 అనే రెండు మూవీ లు రూపొందాయి. ఈ రెండు సినిమాలు కూడా అద్భుతమైన విజయాలు అందుకున్నాయి. మరి వీరి కాంబోలో రూపొందనున్న మూడవ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: