త్రిబుల్ ఆర్ అనే సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపును సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే జక్కన్న సినిమాలో నటిస్తున్న సమయంలోనే మిగతా సినిమాలను కూడా లైన్లో పెట్టేసాడు తారక్. ఈ క్రమంలోనే ప్రస్తుతం తారక్ క్రేజీ లైన్ అప్ అభిమానులందరినీ కూడా ఎంతగానో సంతోషపరుస్తుంది అని చెప్పాలి  ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే మూవీ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.


ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ మూవీలో అటు జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. అయితే ఈ బాలీవుడ్ హీరోయిన్ కు ఇదే మొదటి తెలుగు సినిమా కావడం గమనార్హం. కాగా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ ముగిసిన వెంటనే క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు తారక్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది అన్న విషయం తెలిసిందే.


 కాగా ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ కాంబో ఇప్పటికే ఫిక్స్ అవ్వగా.. ఇక ఈ సినిమాలో  హీరోయిన్ సహ మిగతా పాత్రల్లో నటుల ఎంపిక కొనసాగుతోంది అన్నది తెలుస్తుంది. అయితే ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ ఎవరు అనే విషయంపై గత కొన్ని రోజుల నుంచి చర్చ జరుగుతుంది అని చెప్పాలి. కాగా ఎన్టీఆర్ - ప్రశాంత్  కాంబినేషన్లో తెరకెక్కబోతున్న   మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్గా నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే మేకర్స్ ఆమెను సంప్రదించగా.. ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ఈ సినిమాలో యానిమల్ విలన్ బాబి డియోల్ విలన్ గా నటించబోతున్నాడట. ఏకంగా 15 దేశాలలో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ నిర్వహిస్తారని.. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారంటూ వార్తలు తెరమీదకి వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: