జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చివరికి తాను కోరుకున్నట్లుగా రాజకీయాల్లోకి వచ్చి గెలిచి తన గోల్ ని నెరవేర్చుకున్నారు. జనసేన పార్టీతో కూటమిలో కలిసి అఖండ విజయం సాధించి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టడం, కీలకమైన శాఖల బాధ్యతల్ని స్వీకరించడంతో ఆయన అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.ఇకపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సారథ్యంలో తెలుగు సినీపరిశ్రమ అభివృద్ధి సాధ్యపడుతుందని, మునుపటిలా పరిశ్రమ వేడుకలను ఎంతో వైభవంగా జరుపుకునేందుకు అవకాశం ఉంటుందని, సినిమా టికెట్ రేట్ల వెసులుబాటుకు సహకారం ఉంటుందని భావిస్తున్నారు. ఆనవాయితీగా ఇప్పుడు సినీపెద్దలు డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలవనున్నారు. 


రేపు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని తన అధికారిక క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌ని కలవాలని టాలీవుడ్ అగ్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. దిల్ రాజు, డివివి దానయ్య, అశ్విని దత్, బివిఎస్ఎన్ ప్రసాద్, చినబాబు, నాగ వంశీ, టిజి విశ్వప్రసాద్, మైత్రి నవీన్- రవి ఇంకా కెఎల్ దామోదర్ ప్రసాద్ తదితరులు రేపు విజయవాడలో పవన్‌ కళ్యాణ్ ని కలవనున్నారని తెలుస్తోంది. సినీ నిర్మాతలతో పాటు పలువురు పరిశ్రమ సీనియర్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలిసే వీలుందని కూడా సమాచారం తెలుస్తుంది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే తనదైన మార్క్ చూపిస్తూ ప్రజాసేవలో తలమునకలుగా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో తాను ఏం చేయగలుగుతారో అన్నిటినీ కూడా ఆయన అమలు చేస్తున్నారు. నిర్ణయాల్లో ఆయన వేగం అందరినీ కూడా ఎంతగానో ఆకర్షిస్తోంది. రేపటి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ టాలీవుడ్ నిర్మాణం గురించి సినీ నిర్మాతలు పవన్ కళ్యాణ్ తో మాట్లాడుతారేమో చూడాలి.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజీ, హరిహర వీర మల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొంచెం బ్రేక్ తీసుకొని ఈ సినిమాలు పూర్తి చెయ్యాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: