చైతన్యరావు, హెబ్బా పటేల్  జంటగా  బాలరాజశేఖరుని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’. ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో తెరకెక్కిన ఈ సినిమా నేడు జూన్ 21న థియేటర్స్ లో రిలీజ్ అయింది. తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్య పాత్రలు పోషించారు.పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు, ఒకరి మీద ఒకరికి ఉండే అంచనాలు, అవి అందుకోలేకపోవడంతో వచ్చే కష్టాలు.. ఇలా రియల్ లైఫ్ పాయింట్స్ ని తీసుకొని ఈ హనీమూన్ ఎక్స్‌ప్రెస్ ని తెరకెక్కించారు. అయితే రిసార్ట్ లోకి వెళ్లేంతవరకు బాగానే సాగినా ఆ తర్వాత జరిగేది ఊహ లేక నిజమా అనే భ్రాంతిలో ప్రేక్షకులని పడేస్తారు.స్క్రీన్ ప్లే కూడా కొంచెం కన్ఫ్యూజ్ చేస్తారు. రొమాంటిక్ సీన్స్ మాత్రం హీరో -హీరోయిన్స్ మధ్య బాగానే పెట్టారు. ఇక ఇలాంటి కథాంశంతో వచ్చే సినిమాల్లో క్లైమాక్స్ ముందే తెలిసిపోతుంది కాబట్టి అన్ని సినిమాల్లో లాగే ఇక్కడ కూడా అదే భార్యాభర్తల క్లైమాక్స్ ఉంటుంది. తనికెళ్ళ భరణి, సుహాసిని జంటతో కామెడీ ట్రై చేసినా అంతగా వర్కౌట్ అవ్వలేదు. కథ అంతా రెండు క్యారెక్టర్స్ మధ్యే సాగడంతో అక్కడక్కడా బోర్ కొడుతుంది.ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ తో థియేటర్ల సంఖ్య పెరుగుతోంది. 50 స్క్రీన్ తో నిన్న రిలీజైన "హనీమూన్ ఎక్స్ ప్రెస్" సినిమా అదే రోజు 70 స్క్రీన్ కు చేరింది. టాక్ బాగుండటంతో బీ, సీ సెంటర్ లో డిస్ట్రిబ్యూటర్స్ సినిమా రిజల్ట్ పట్ల హ్యాపీగా ఉన్నారు. బీ, సీ సెంటర్ లో కొత్త థియేటర్స్ యాడ్ అవుతున్నాయి.

"హనీమూన్ ఎక్స్ ప్రెస్" సినిమాలో దర్శకుడు బాల రాజశేఖరుని చూపించిన ఇన్నోవేటివ్ కాన్సెప్ట్, కథను తెరకెక్కించిన విధానం, కాంటెంపరరీ స్టోరీని అందరికీ నచ్చేలా ప్రెజెంట్ చేసిన పద్ధతి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోందని అంటున్నారు చూసిన ప్రేక్షకులు. క్రిటిక్స్ నుంచి కూడా ఈ సినిమాకు అప్రిషియేషన్స్ దక్కుతున్నాయి. మూవీ లోని నాలుగు పాటలు బాగున్నాయనే పేరొచ్చింది. హెబ్బా పటేల్, చైతన్య రావ్ జంట కొత్తదనం అందిస్తోంది. ద్వితీయార్థంలో వచ్చే వీరి రొమాంటిక్ సాంగ్ మూవీ కి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. తనికెళ్ల భరణి, సుహాసినీ పెయిర్ కూడా కథలో కీలకంగా ఉండి ఆకట్టుకుంటోందని చెబుతున్నారు.దర్శకుడు బాలరాజశేఖరుని ఓ మంచి సినిమా చేస్తాడనే నమ్మకం తో "హనీమూన్ ఎక్స్ ప్రెస్" సినిమాకు నాగార్జున, అమల, రాఘవేంద్రరావు, విజయేంద్రప్రసాద్, ఆర్జీవీ, అడివి శేష్, అవసరాల శ్రీనివాస్ వంటి స్టార్స్ ప్రమోట్ చేశారని. వారి నమ్మకం ఆడియన్స్ ఆదరణతో నిజమవడం పట్ల మూవీ టీమ్ హ్యాపీగా ఉన్నామని చెబుతున్నారు ఈ సినిమా నిర్మాతలు. "హనీమూన్ ఎక్స్ ప్రెస్" సినిమాను న్యూ రీల్ ఇండియా బ్యానర్ పై కేకేఆర్, బాలరాజ్ నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: