తెలుగు సినిమా పరిశ్రమలో అద్భుతమైన ఈమేజ్ కలిగిన కుటుంబాలలో మెగా కుటుంబం ఒకటి. ఇకపోతే ఈ కుటుంబం నుండి మొదటగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా కెరియర్ ను మొదలు పెట్టాడు. ఆయన ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరో స్థాయికి వెళ్ళాడు. అలాగే స్టార్ హీరో స్థాయికి వెళ్ళినా కూడా ఎలాంటి గర్వం లేకుండా చిన్న స్థాయి వ్యక్తుల నుండి పెద్ద స్థాయి వ్యక్తుల వరకు ఎవరితో ఎలా ఉండాలి ఎవరితో ఎంత వరకు ఉండాలి అనే పరిణీతితో నడుచుకుంటూ ఎంతో మంది మనసులను గెలుచుకున్నాడు.

అలాగే తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకొని ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. ఇకపోతే చిరంజీవి బాటలోనే ఇప్పటికే ఎంతో మంది మెగా కుటుంబం నుండి సినిమా పరిశ్రమలోకి హీరోలు వచ్చారు. అందులో చాలా మంది సూపర్ సక్సెస్ కూడా అయ్యారు. ఇక వారంతా వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో వారు కానీ వారి కుటుంబాలు కానీ కలుసుకోకపోవడం వల్ల వారి మధ్య దూరం పెరిగే విభేదాలు వచ్చే అవకాశం ఉంది అని గ్రహించిన చిరంజీవి అలా అస్సలు జరగకూడదు అనే ఉద్దేశంతో ఒక పెద్ద ప్లాన్ వేసినట్లు , ఆ ప్లాన్ వల్లే ఇప్పటికీ వీరంతా ఎంతో అన్యోన్యంగా కలిసి ఉన్నట్లు తెలుస్తోంది.

చిరంజీవి వేసిన ఆ ప్లాన్ ఏంటో తెలుసా ... ఎవరు ఎన్ని సినిమాలతో బిజీగా ఉన్నా , ఎన్ని పనులతో సతమతం అవుతున్న వారంతా కనీసం నెలలో ఒక రోజు లేదా రెండు రోజులు అంతా ఒక చోట కలిసి సంతోషంగా గడపాలి అని రూల్ పెట్టినట్లు , ఆ రూల్ ప్రకారం మెగా కుటుంబ సభ్యులు అంతా నెలలో ఒకటి లేదా రెండు రోజులు అంతా కలిసి ఒక చోటే కలిసి మెలిసి ఉండి తమ కష్ట సుఖాలను పంచుకోనట్లు దాని వల్ల వీరి మధ్య ఎలాంటి విభేదాలు తలెత్తడం లేదు అని తెలుస్తుంది. అలా చిరంజీవి రూల్ వల్ల మెగా ఫ్యామిలీ ఎంతో కలిసి మెలిసి ఉంటున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: