సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు జరుగుతుంటాయి. అవకాశం ఇస్తానని ఆశ చూపి ఆడవారిని వాడుకునే వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది ఉంటారు. నిజానికి రంగాల్లోనూ ఇలాంటి కామాంధులు ఉంటారు కానీ సినిమా ఇండస్ట్రీలోని నటీమణులు వీటి గురించి ఎప్పుడూ బయటపడుతుంటారు కాబట్టి ఇవి ఎక్కువగా హైలైట్ అవుతుంటాయి. తాజాగా తెలుగు సినిమా దర్శకుడు ఒకరు తనతో అసభ్యంగా ప్రవర్తించారని సీనియర్ యాక్ట్రెస్ మితా వశిష్ఠ్ చెప్పారు.
చెన్నై ఫిల్మ్ ఫెస్టివల్‌కు వెళ్లినప్పుడు ఆ దర్శకుడు తనను గది నుంచి వెళ్లనివ్వకుండా అడ్డగించి, ఆ తర్వాత తనను వెంబడించాడని చెప్పారు. అయితే మితా సురక్షితంగా అక్కడి నుంచి తప్పించుకున్నారు. ప్రముఖ నటి మీతా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "ఒక తెలుగు సినిమా దర్శకుడు నాకు తన సినిమాలో హీరోయిన్ పాత్ర ఇస్తానని చెప్పాడు. కానీ, ఆ పాత్ర కోసం నన్ను రెండు నెలలు ఆయనతో కలిసి ఉండాలని కూడా చెప్పాడు. డైరెక్ట్ గా ఉంచుకుంటానని అతడు అలా మాట్లాడడంతో నాకు ఎంతో బాధగా అనిపించింది." అని చెప్పుకొచ్చింది.
మీతా ఇంకా మాట్లాడుతూ "తన మాటలు నాకు అర్థమయ్యాయో లేదో చూడడానికి ఆ దర్శకుడు మళ్ళీ అదే మాటలు చెప్పాడని చెప్పారు. "నువ్వు నాతో కలిసి ఉండాలి. నీకు అర్థమవుతుందా?" అని ఆయన అడిగినట్లు తెలిపింది. ఆ సమయంలో చెన్నై ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెండు సినిమాలు ప్రదర్శితమవుతున్నాయి. ఆమె స్నేహితులు కుమార్ షాహని, ఖలీద్ మహమ్మద్ అనే వారు ఆమెకు అతికొద్ది దూరంలోని మరొక గదిలో ఉన్నారు.
ఆ తర్వాత మీతా ఆ ప్రతిపాదనను తిరస్కరించి గది నుంచి వెళ్లాలని ప్రయత్నించినప్పుడు ఆ దర్శకుడు తలుపు వద్దే ఆమెను అడ్డుకున్నాడు. ఆ దర్శకుడి మాటలు విని మీతా నవ్వడం మొదలుపెట్టారు. ఆయనకు ఆశ్చర్యంగా అనిపించి కొద్దిసేపు ఆగిపోయాడు. అదే అదునుగా భావించిన మీతా ఆ గది నుంచి బయటకు వచ్చి తన స్నేహితుల దగ్గరకు సురక్షితంగా చేరుకున్నారు. అయితే ఆమె ఈ దర్శకుడు గురించి చెప్పింది కానీ మొదటి పేరు మాత్రం రిలీజ్ చేయలేదు అతను ఎవరై ఉంటారని చాలామంది ఊహగానాలు చేసుకుంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి