వేప నీటితో స్నానం చెయ్యడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటారు. చాలా మందికి కూడా చెమట వాసన తరచుగా సమస్యలను సృష్టిస్తుంది. మన శరీరంలో బ్యాక్టీరియా ఉత్పత్తి కావడమే దీనికి కారణం. అలాంటి సమయంలో వేప ఆకులతో స్నానం చేయడం అనేది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల చెమట దుర్వాసన ఈజీగా పోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంకా అలాగే కురుపులు-మొటిమలతో ఇబ్బంది పడే వారికి వేప ఆకుల నీటితో స్నానం చేయడం అనేది సర్వరోగ నివారిణిగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వేప సహజ యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంది. ఇది దిమ్మలు ఇంకా దద్దుర్లు సమస్య నుంచి చాలా సులభంగా ఉపశమనం కలిగిస్తుంది.అలాగే మనకు కంటి ఇన్ఫెక్షన్ సమస్య ఉంటే వేప నీళ్లతో సమస్య చక్కగా పరిష్కారమవుతుంది. వేప నీళ్లతో స్నానం చేసి కళ్లు కడుక్కోవడం వల్ల ఇన్ఫెక్షన్, కండ్లకలక అంటే కళ్లు ఎర్రబడడం ఇంకా అలాగే కళ్ల వాపు వంటి సమస్యలు చాలా ఈజీగా నయమవుతాయి. ఇంకా అలాగే వేపనీటితో స్నానం చేయడం వల్ల మొటిమల సమస్య చాలా ఈజీగా తొలగిపోయి ముఖంలో మెరుపు వస్తుంది. 


మచ్చలు, మొటిమలు కనుక మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే వేప నీటితో ముఖాన్ని శుభ్రంగా కడగాలి. ఎందుకంటే ఇది సహజమైన మెరుపును కలిగి ఉంటుంది. అందువల్ల తాజాగా కనిపిస్తుంది. అలాగే చుండ్రు, పొడి జుట్టు, పేనుతో ఇబ్బంది పడుతుంటే వేప నీటితో స్నానం చేయడం కచ్చితంగా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది నిర్జీవమైన జుట్టుకు జీవం ఇంకా మంచి మెరుపునిస్తుంది. అందుకే వేప నీళ్లతో జుట్టు కడుక్కునేటపుడు షాంపూ పెట్టాల్సిన పనిలేదు. పేను సమస్య నుంచి కూడా మీరు ఈజీగా ఉపశమనం పొందవచ్చు.పచ్చి వేప ఆకులను తీసుకుని ఆకుల రంగు పోయి నీరు ఆకుపచ్చగా కనిపించే దాకా ఉడికించి ఆ తరువాత కాటన్ క్లాత్‌తో బాగా ఫిల్టర్ చేసి స్నానపు నీటిలో కలపాలి. ఇలా వారానికి కనీసం ఒక రెండు మూడు సార్లు చేయాలి. వేప స్నానం చేసేటప్పుడు శరీరాన్ని సాఫ్ట్ గా రుద్దాలి. ఇది చర్మాన్ని బాగా హైడ్రేట్ చేస్తుంది, ఇంకా శరీరానికి పోషణను అందిస్తుంది. ఈ నీరు వల్ల చర్మ సంబంధించిన సమస్యలు కూడా ఈజీగా దూరమవుతాయి. కావాలంటే వేపతో పాటు కలబంద, తులసి ఆకులను కూడా మీరు ఉడకబెట్టవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: