అలాంటి పెద్ద హీరో పెద్ద పెద్ద డైరెక్టర్లతోనే సినిమాలు చేయడానికి ఆసక్తిని కనపరుస్తూ ఉంటాడు. కానీ చిన్న డైరెక్టర్ చేతిలో కెరియర్ను పెట్టి సాహసం చేయాలని ఎవరు అనుకుంటారు. ప్రభాస్ కి ఉన్న మొహమాటమో లేకపోతే డైరెక్టర్ చెప్పిన కథ నచ్చో తెలియదు. కానీ మారుతి లాంటి మిడ్ రేంజ్ డైరెక్టర్ కి ప్రభాస్ సినిమా అవకాశాన్ని ఇచ్చేశాడు. ఇక ఈ సినిమాకు ముందు కూడా మారుతికి పెద్దగా హిట్స్ లేవు. అన్ని డిజాస్టర్ ప్లాప్స్. అయినప్పటికీ ప్రభాస్ ఎలా అవకాశమిచ్చాడో మాత్రం ఎవరికీ అర్థం కాలేదు. ఇక ఇప్పుడు రాజా సాబ్ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.
తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తాను పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపును సంపాదించుకోవాలని అనుకుంటున్నాడు మారుతి. హారర్ కామెడీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఏప్రిల్ 10వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది. అయితే ఇక ప్రభాస్ కి ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది. కాబట్టి ఒక్కో సినిమాకి 100 నుంచి 150 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ మిడ్ రేంజ్ దర్శకుడిగా పేరున్న మారుతి ఇప్పుడు ప్రభాస్ సినిమా కావడంతో హై రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. సాధారణంగా ఒక్కో సినిమాకి రెండు నుంచి మూడు కోట్లు మాత్రమే తీసుకునే మారుతి.. ఇక ఇప్పుడు రాజసాబ్ మూవీ కోసం 15 నుంచి 20 కోట్లు తీసుకుంటున్నాడట. ఇలా ప్రభాస్ నుంచి అవకాశం రావడం.. భారీ పారితోషకం దక్కడం అంటే మారుతీ నక్క తోక తొక్కేశాడు అంటూ నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు.