టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి, బాలయ్య మధ్య పోటీ ఇప్పటిది కాదు. ఈ ఇద్దరు హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద చాలా సందర్భాల్లో పోటీ పడ్డాయి. అయితే ఈ పోటీలో మెజారిటీ సందర్భాల్లో చిరంజీవి పైచేయి సాధించగా కొన్ని సందర్భాల్లో మాత్రం బాలయ్య పైచేయి సాధించారు. అయితే ఈ ఇద్దరు హీరోలకు ఒకరిపై మరొకరికి గౌరవం మాత్రం ఉంది. తాజాగా బాలయ్య చిరంజీవిపై ప్రత్యేక గౌరవాన్ని చాటుకున్నారు.
 
బాలయ్య ప్రస్తుతం అన్ స్టాపబుల్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. దాయి దాయి దామ్మ సాంగ్ కు అటు శ్రీలీల ఇటు నవీన్ పోలిశెట్టి సరిగ్గా డ్యాన్స్ స్టెప్పులు వేయలేకపోయారు. ఆ సాంగ్ కు సంబంధించిన పాయింట్ ను ఎవరికీ ఇవ్వకుండా ఈ పాయింట్ చిరంజీవికి ఇచ్చేస్తున్నా అని బాలయ్య పేర్కొన్నారు. నవీన్ పోలిశెట్టి, శ్రీలీల కాంబినేషన్ లో ఒక సినిమా రావాల్సి ఉన్నా వేర్వేరు కారణాల వల్ల ఆగిపోయింది.
 
స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో సినిమా రావాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుందో రాదో తెలియాల్సి ఉంది. బాలయ్య నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటుండగా డాకు మహారాజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. బాలయ్యను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.
 
బాలయ్య ఒక్కో సినిమాకు 35 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. బాలయ్యను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా బాలయ్య సినిమాలు సీడెడ్ లో ఆంచనాలకు మించి సక్సెస్ సాధిస్తున్నాయి. బాలయ్య ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాలయ్య క్రేజ్ మాత్రం మామూలుగా లేదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాలయ్య తర్వాత సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి: