అమీషా పటేల్ ఈ చిన్నదాని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మోడల్ గా తన కెరీర్ ప్రారంభించిన అమీషా పటేల్ సినిమాల మీద ఉన్న ఆసక్తితో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మొదట బాలీవుడ్ లో తన కెరీర్ ప్రారంభించిన అమీషా అనంతరం తెలుగులోను అనేక సినిమాలలో అవకాశాలను అందుకుంది. తెలుగులో బద్రి, నాని వంటి సినిమాలలో నటించి సక్సెస్ సాధించింది. దాదాపు ఈ చిన్నది స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశాలను అందుకుంది. తెలుగులో కేవలం కొన్ని సినిమాలలో మాత్రమే నటించిన అమీషా పటేల్ బాలీవుడ్ లో అనేక సినిమాలు చేసింది. హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

 అమీషా హీరోయిన్ గా మాత్రమే కాకుండా నిర్మాతగాను పలు సినిమాలకు నిర్మాణం వహించి సక్సెస్ సాధించింది. కాగా, అమీషా పటేల్ వయసు పెరిగినప్పటికీ ఇంతవరకు వివాహం చేసుకోకుండా సింగిల్ గానే ఉంది. ఈ చిన్నదాని వయసు 50కి పైనే ఉన్నప్పటికీ ఒంటరిగా తన లైఫ్ ను కొనసాగిస్తోంది. సినిమాలలో నటిస్తున్న సమయంలో కొంతమంది హీరోలతో ఎఫైర్లు కొనసాగించినట్లుగా అనేక రకాల వార్తలు వచ్చినప్పటికీ ఈ బ్యూటీ ఎవరిని కూడా వివాహం చేసుకోలేదు. ఇప్పటికే ఈ చిన్నది కొంతమంది యంగ్ హీరోలతో ఎఫైర్లు కొనసాగిస్తున్నట్లుగా సోషల్ మీడియా మాధ్యమాల్లో అనేక రకాల వార్తలు వైరల్ అవుతాయి.

ఆ వార్తలపై ఈ చిన్నది ఇంతవరకు స్పందించకపోవడం విశేషం. కాగా, అమీషా పటేల్ వయసు పెరిగిన ఏమాత్రం తరగని అందం, ఫిట్నెస్ కొనసాగిస్తూ యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీని ఇస్తోంది. ఇదిలా ఉండగా.... ప్రస్తుతం అమీషా పటేల్ తనకు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసుకుంది. అందులో ఆకుపచ్చ రంగు బికినీ వేసుకుంది. ఆ ఫోటోలలో అమీషా పటేల్ బేబీ బంప్ తో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. అమీషా పటేల్ వివాహం చేసుకోకుండానే పిల్లల్ని కనడానికి సిద్ధమైందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వార్తలపై అమీషా పటేల్ ఏదో ఒక క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం బయటకు రాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: