కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న సినిమాలు వ‌రుస పెట్టి ప్లాపులు అవుతున్నా కూడా ర‌జ‌నీ క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌దు ... ర‌జ‌నీ మానియా ఆ స్థాయిలో ఉంటుంది. ఇక ర‌జ‌నీ న‌టిస్తోన్న జైల‌ర్ 2 సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం కేర‌ళలో జ‌రుగుతోంది. గ‌తంలో వ‌చ్చిన జైల‌ర్ సినిమాకు సీక్వెల్‌గా ఈ జైల‌ర్ 2 తెర‌కెక్కుతోంది. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాను పూర్తి స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దుతున్నాడు.


ఇక ఈ సినిమా షూటింగ్‌లో ఉండగానే ఈ సినిమా రైట్స్ కోసం భారీ డిమాండ్ నెలకొన్నట్లు కోలీవుడ్ మీడియాలో ... కోలీవుడ్ ట్రేడ్ వ‌ర్గాల్లో భారీ ఎత్తున టాక్ వినిపిస్తోంది. ఓ బ‌డా నిర్మాణ సంస్థ జైల‌ర్ 2 థియేట్రిక‌ల్ రైట్స్ కోసం భారీ ఆఫ‌ర్ ఇచ్చింద‌ట‌. ఆ స్థాయిలో ఆఫ‌ర్ రావ‌డం అంటే .. అది కూడా సినిమా షూటింగ్‌లో ఉండ‌గానే అంటే సినిమాపై ఏ స్థాయిలో క్రేజ్ ఉందో తెలుస్తోంది.


అయితే ‘ జైలర్ 2 ’ మేకర్స్ మాత్రం ఈ ఆఫర్‌ రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. వారు ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యేసరికి డీల్ క్లోజ్ చేయాలని చూస్తున్నారట. మరి ‘జైలర్ 2’ చిత్ర రైట్స్ ఎలాంటి రికార్డ్‌ను సెట్ చేస్తాయో చూడాలి. ఇక ఈ సినిమాలో రమ్యకృష్ణ, యోగిబాబు, మిర్నా మీనన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా శివ రాజ్‌కుమార్ ఓ గెస్ట్ పాత్రలో కనిపిస్తారు.


స‌మ‌స్య మీది.. ప‌రిష్కారం మాది.. జాగృతం కండి తెలుగు ప్ర‌జ‌లారా...

స‌మ‌స్యలు లేని వ్య‌క్తులే కాదు.. స‌మాజం కూడా లేదు. అయితే.. స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు.. దానిని ఎవ‌రికి చెప్పాలి ? ఎవ‌రిని క‌ల‌వాలి ?  ఎలా ప‌రిష్క‌రించుకోవాలి ? అనేది కీల‌కం. అది అవినీతి అయినా.. లంచాలైనా.. రాజ‌కీయ నాయ‌కులు పెట్టే ఇబ్బందులు అయినా మీ స‌మ‌స్య‌ను మా స‌మ‌స్య‌గా భుజాన వేసుకుంటాం. నేత‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. అధికారులు దురుసుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని చింతించాల్సిన అవ‌సర‌మే లేదు. రండి.. చేయి చేయి క‌లుపుదాం.. మీ చింత తీర్చుదాం. మీ స‌మ‌స్య ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.. ప‌రిష్కార మార్గాన్ని పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి: