చిన్న సినిమాలు ముఖ్యంగా డబ్బింగ్ సినిమాలు ప్రేక్షకులకు నచ్చితే ఆసినిమాలను కొనుక్కున్న బయ్యర్లకు కనక వర్షం కురుస్తుంది అన్న విషయానికి మరొకసారి ప్రత్యక్ష ఉదాహరణ లేటెస్ట్ గా విఉదలైన ‘జింఖానా’ మూవీ. మళయాళంలో విడుదలై అక్కడ సూపర్ హిట్ అయిన ‘అలప్పుజ జింఖానా’ సారంగపాణి జాతకం మూవీతో పోటీగా విడుదలైన విషయం తెలిసిందే.


వాస్తవానికి ఈ డబ్బింగ్ సినిమా విడుదలకు ముందు ఈ సినిమాను ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఈసినిమాకు టోటల్ పాజిటివ్ టాక్ తో ఈమూవీ కలక్షన్స్ బాగా పెరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యూత్ ఎక్కువగా ఈమూవీకి వస్తున్నట్లు టాక్. అవుట్ అండ్ అవుట్ కామెడీగా బాక్సింగ్ క్రీడ నేపద్యంలో రూపొందిన ఈమూవీలోని కామెడీ ప్రేక్షకులకు బాగా నచ్చినట్లు తెలుస్తోంది.  


అయితే ఈసినిమా ఎ సెంటర్ల ప్రేక్షకులకు బాగా నచ్చింది కానీ బిసి సెంటర్ల ప్రేక్షకులకు మాత్రం అంతంత మాత్రంగానే ఈసినిమాకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఆరుగురు ఇంటర్ చదివిన కుర్రాళ్ళు పై చదువుల కోసం స్పోర్ట్స్ కోటాలో బాక్సింగ్ అకాడెమి చేరతారు. వారికి లోకల్ గేమ్స్ లో గెలిచినా స్టేట్ లెవెల్ కు వెళ్ళాక అసలు సవాల్ మొదలవుతుంది. ఈ పాయింట్ చుట్టూ దర్శకుడు ఖలీద్ రెహమాన్ పూర్తిగా నేటి యూత్ ను దృష్టిలో పెట్టుకుని ఈసినిమాను తీశాడు. వాస్తవానికి తెలుగు ప్రేక్షకులకు క్రికెట్ ఫుట్ బాల్ గురించి బాగా తెలుసు కానీ బాక్సింగ్ గురించి పెద్దగా అవగాహన లేదు.


అయినప్పటికీ ఈసినిమాను ప్రేక్షకులు బగా ఎంజాయ్ చేస్తున్నారు. ముగిసిన వీకెండ్ తో ఈమూవీ బ్రేక్ ఈవెన్ కు వచ్చినట్లు తెలుస్తోంది. ఈమూవీతో పోటీగా విడుదలైన ‘సారంగపాణి జాతకం’ మూవీకి ఏవరేజ్ టాక్ రావడంతో పాటు కలక్షన్స్ అంతంతమాత్రంగా ఉండటంతో ‘జింఖానా’ మూవీకి కలిసి వచ్చే అంశంగా కూడ మారింది అన్న కామెంట్స్ ఉన్నాయి. ఈవారం విడుదల కాబోతున్న నాని ‘హిట్ 3’ విడుదల తేదీ వరకు యూత్ కు ‘జింఖానా’ మూవీ మంచి సినిమా అన్న అభిప్రాయాన్ని కలిగించింది అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: