
అప్పుడప్పుడే ముత్తు సినిమా వచ్చి పెద్ద ప్రభంజనం సృష్టిస్తోంది, అందులో థిల్లాన థిల్లాన నా కసి కళ్ళ కూన పాట వైరల్ అయిపోయింది, మరోమాట లేకుండా మన టైటిల్ "థిల్లాన" అనేశాడు. అప్పటి నుంచే పూరికి వెరైటీ టైటిల్స్ అలవాటు. పూరి టైటిల్స్ అన్నీ చాలా క్యాచీగా ఉంటాయి. థిల్లాన అనే ఒక టైటిల్ తో సినిమా ఉందని చాలామందికి తెలియదు. రౌడీ అన్నయ్య, నెంబర్ వన్, అమ్మ దొంగా, తెలుగు వీర లేవరా లాంటి సినిమాలతో దూసుకుపోతున్నారు సూపర్ స్టార్ కృష్ణ. ఆయన సెకండ్ ఇన్సింగ్స్ బాగా నడుస్తోన్న టైం అది. ఏ పెద్ద హీరోకు ఈ కథ చెప్పిన అనుభవం లేకపోయినా పూరీ చెప్పిన కథ ఆయనకు నచ్చింది...
పూరీ సంతోషానికి హద్దుల్లేవు, డైరెక్టర్ అవ్వాలన్న తన కల ఇంత తొందరగా నిజం అవుతుందని అనుకోలేదు, అయితే ఆ ఆనందం ఎక్కువరోజులు లేదు... 1996 లో క్లాప్ కొట్టి, మూడు రోజుల ఫస్ట్ షెడ్యూల్ తరువాత సినిమా ఆగిపోయింది, దానికి కారణం అంతకుముందు సంవత్సరంలో ఐబీకే మోహన్ శోభన్ బాబుతో దొరబాబు సినిమా తీశాడు, అది ఫ్లాప్ అవ్వడంతో ఫైనాన్షియల్ ప్రాబ్లెమ్స్ వల్ల సినిమా ఆగిపోయింది. దొరబాబు సినిమా బాగుంటుంది కానీ సరిగా ఆడలేదు, అందులో ప్రియా రామన్ హీరోయిన్. పూరి దిగాలుగా ఉన్నాడట.. ఆ టైంలో అటువైపుగా సినిమా వెహికల్ ఒకటి వచ్చి ఆగింది, "కృష్ణ గారితో సినిమా ఆగిపోతే ఏంటి, నువ్వు కృష్ణ కొడుకుతో ఇండస్ట్రీ హిట్ కొడతావేమో ఎవరికి తెలుసు, బాధపడుతూ కూర్చుంటే పనులవ్వవు ఇక్కడ" ఈ మాట చెప్పింది అప్పటికే పూరీ జగన్నాథ్ కు పరిచయం ఉన్న సీనియర్ ఆర్టిస్ట్ రమాప్రభ. ఆ తర్వాత ఆమె మాటలే నిజాలు అయ్యాయి. అదే కృష్ణ కొడుకు మహేష్‌బాబుతో పోకిరి, బిజినెస్‌మెన్ సినిమాలు తీశారు. అందులో పోకిరి ఇండస్ట్రీ హిట్.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు