- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాపై హైప్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పవన్ కళ్యాణ్ లైన్ అప్లో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. వీటిలో ముందుగా వచ్చే సినిమా హరిహర వీరమల్లు. ఆ తర్వాత సుజిత్ దర్శకత్వంలో తెర‌కెక్కే ఓజి సినిమా రిలీజ్ అవుతుంది. ఈ రెండు సినిమాల పూర్తయ్యాక‌ హరీశంకర్ దర్శకత్వంలో ఉస్తాద్‌ భగత్ సింగ్ సినిమా తెరమీదకు వెళుతుంది. ఇది ఇలా ఉంటే ఓజి సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్ట‌ర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇమ్రాన్ హష్మీ - ప్రియాంక మోహన్ - శ్రీకాంత్ - అర్జున్ దాస్‌ లాంటి నటులు ఈ సినిమాలో భాగం అవుతున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో త్రిబుల్ ఆర్ నిర్మాత దాన‌య్య నిర్మిస్తున్న ఈ సినిమాకు థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఇంకా అధికారికి ప్రకటన రాకపోయినా సెప్టెంబర్ 27న విడుదలవుతుందని టాక్‌?


క‌థ అంతా ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంలో సాగుతుందని పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ పాత్రలో అలరిస్తాడని అంటున్నారు. ఈ సినిమా థియేటర్ రైట్స్ పై ఇప్పటికే ఏపీలో భారీ డీల్స్ జరుగుతున్నాయి. ఉత్తరాంధ్ర - తూర్పుగోదావరి జిల్లా హక్కులను కాకినాడ జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ - ఈస్ట్ గోదావరి డిస్ట్రి బ్యూట‌ర్‌ సత్యనారాయణ కలిపి తీసుకున్నట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గత సినిమాలకు ఎప్పుడూ లేనంత రేటు పెట్టి మరి వీరిద్దరూ ఈ సినిమా ఉత్తరాంధ్ర .. ఈస్ట్ రైట్స్‌ తీసుకున్నట్లు సమాచారం. ఈ రైట్స్ గురించి ఇప్పుడు టాలీవుడ్ లో పెద్దగా చర్చలు నడుస్తున్నాయి. ఉదయ్ శ్రీనివాస్ జనసేన ఎంపీగా ఉండటం ... సత్యనారాయణ ఈస్ట్ గోదావరిలో కీలక డిస్ట్రిబ్యూటర్ గా ఉండడంతో ఈ డీల్ ను మరింత ఆసక్తిగా మార్చాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

og