మెగా కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినీ పరిశ్రమలోనే మెగా ఫ్యామిలీకి ప్రత్యేకమైన పేరు, ప్రఖ్యాతలు ఉన్నాయి. మెగా కుటుంబం నుంచి హీరోలుగా ఎంతో మంది చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. చిరంజీవి కుమారుడిగా చిత్ర పరిశ్రమకు పరిచయమైన రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ హీరో సినీ పరిశ్రమలో ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. 


ఇప్పటివరకు తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి సక్సెస్ఫుల్ స్టార్ హీరోగా తన కెరీర్ కొనసాగిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ హీరోగా మారాడు. ఇక రామ్ చరణ్సినిమా అనంతరం నటించే సినిమాలు అన్ని మంచి విజయాలను అందుకుంటున్నాయి. రీసెంట్ గా నటించిన గేమ్ చెంజర్ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇందులో బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ నటిస్తోంది.

సినిమా షూటింగ్ ఇదివరకే ప్రారంభించారు. క్రికెట్ నేపథ్యంలో ఈ సినిమా వస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా చిత్రీకరిస్తున్నారు. తొందర్లోనే సినిమాను పూర్తి చేసి అభిమానులకు అందించాలనే కోరికతో బుచ్చిబాబు సిద్ధంగా ఉన్నారట. అయితే ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం స్టార్ హీరోయిన్ ను సంప్రదించగా ఆమె సున్నితంగా రిజెక్ట్ చేసిందట. ఆమె మరెవరో కాదు పూజా హెగ్డే.

ఈ భామను ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయమని కోరగా ఆమె నో చెప్పిందట. ఇదివరకే రంగస్థలం సినిమాలో ఈ భామ ఐటమ్ సాంగ్ చేసి మంచి గుర్తింపును అందుకుంది. ఆ కారణంగానే మరోసారి రామ్ చరణ్ సినిమాలో పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ చేసినట్లయితే మంచి గుర్తింపు అందుకుంటుందని అనుకున్నారట. దానికోసం ఆమెను సంప్రదించగా ఆమె రిజెక్ట్ చేసినట్టుగా సినీ సర్కిల్స్ లో ఓ వార్త వైరల్ అవుతుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: