బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో ప్రముఖ నటి అతియా శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ భామ మోడల్ గా తన కెరీర్ ప్రారంభించింది. అనంతరం సినిమాలలో ఎలాగైనా హీరోయిన్ గా ఎదగాలని బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. తాను నటించిన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు అందుకున్న అతియా శెట్టి అనేక సినిమాలలో అవకాశాలను అందుకొచ్చుకుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా తన హవాను కొనసాగించింది. 

అనేక సినిమాలలో నటించి తన నటనతో అనేకమంది అభిమానులను సంపాదించుకుంది. కాగా అతియ శెట్టి వ్యక్తిగత విషయానికి వచ్చినట్లయితే ఆమె ప్రముఖ క్రికెటర్ కే ఎల్ రాహుల్ ను చాలా కాలం పాటు ప్రేమించిన అనంతరం కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహాన్ని జరుపుకున్నారు. చాలా సంవత్సరాల పాటు సీక్రెట్ గా వీరి రిలేషన్ కొనసాగించారు. ఈ జంట 2023 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత ఈ భామ ఎప్పటిలానే సినిమాలలో నటించింది.

రీసెంట్ గానే అతియా శెట్టి, కేఎల్ రాహుల్ దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. అతియా శెట్టి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం అతియా శెట్టి తన మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. ఈ క్రమంలోని అతియా శెట్టి సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. అతియా శెట్టి సినిమాలకు వీడ్కోలు పలికినట్లుగా బాలీవుడ్ సర్కిల్స్ లో ఓ వార్త వైరల్ గా మారింది. సినిమాలకు వీడ్కోలు చెప్పాలని కేఎల్ రాహుల్ గత కొద్దిరోజుల నుంచి ఇబ్బంది పెడుతున్నారట. ఈ కారణంగానే తన భర్త కోరిక మేరకు అతియా శెట్టి సినిమాలకు వీడ్కోలు చెప్పినట్లుగా ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ విషయం తెలిసి అతియా శెట్టి అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ విషయం పైన మరింత సమాచారం వెలువడనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: