తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నారు. అందులో కొంతమంది మాత్రమే మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. అలాంటివారిలో ప్రముఖ నటి రాశి కన్నా ఒకరు. ఈ భామ ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే అభిమానుల మనసులను దోచుకుంది. మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్న ఈ చిన్నది బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ తెలుగు సినీ పరిశ్రమలోనే ఆగ్ర హీరోయిన్ గా గుర్తింపు సాధించింది. 

భామ తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో నటించి సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన హవాను కొనసాగిస్తోంది. రాశి కన్నా ఒకప్పుడు ఎంతో లావుగా, బొద్దుగా ఉండేది. అలా ఉండడం వల్ల తనకు సినిమా అవకాశాలు ఎక్కువగా రావడం లేదని భావించిన ఈ చిన్నది చాలా స్లిమ్ గా తయారయింది. అనంతరం ఈ చిన్న దానికి అనేక సినిమాలలో హీరోయిన్ గా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం తన చేతి నిండా వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉండగా.... ప్రస్తుతం రాశికన్నా ఓ బాలీవుడ్ హీరోతో ఎఫైర్ కొనసాగిస్తున్నట్లుగా అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.

 ఆ హీరోతో కలిసి సీక్రెట్ గా రిలేషన్ కొనసాగిస్తుందని బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వార్త కోడై కూస్తోంది. దానికి గల ప్రధాన కారణం ఈ అమ్మడు హిందీలో ఓ సినిమాలో నటించిన సమయంలో ఆ హీరోతో కలిసి రొమాంటిక్ సన్నివేశాలు, బోల్డ్ సీన్లలో ఎక్కువగా నటించింది. అంతేకాకుండా ఆ హీరోకు డీప్ గా లిప్ లాక్ ఇస్తున్న వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. ఆ కారణంగానే ఆ హీరోతో సీక్రెట్ గా ప్రేమాయణం కొనసాగిస్తుందని త్వరలోనే వివాహం చేసుకోవాలని ఫిక్స్ అయినట్లుగా అనేక రకాల వార్తలు వస్తున్నాయి. ఈ విషయం పైన మరింత సమాచారం వెలువడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: