మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం సినీ పరిశ్రమలోనే అత్యంత ఎక్కువ డిమాండ్ ఉన్న హీరోయిన్లలో తమన్నా ముందు వరుసలో ఉంటారు. ఈ భామ సినీ పరిశ్రమకు పరిచయమై దాదాపు 20 ఏళ్లకు పైనే అవుతున్న ఇప్పటికీ వరుసగా సినిమాలు చేసుకుంటూ తన సత్తాను చాటుకుంటుంది. తెలుగు, హిందీ లాంటి అనేక సినిమా భాష చిత్రాలలో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం తమన్నా చేతిలో ఐదు ఆరు సినిమా ప్రాజెక్టులకు పైనే ఉండడం విశేషం. ఈ భామ సినిమాల ద్వారా భారీగా డబ్బులను సంపాదిస్తోంది. 

ఒక్కో సినిమాలో నటించడానికి దాదాపు 5 కోట్లకు పైనే రెమ్యూనరేషన్ వసూలు చేస్తుందట. సినీ పరిశ్రమలోని అత్యధిక రెమ్యూనరేషన్ వస్తువులు చేస్తున్న హీరోయిన్లలో ఈ భామ ముందు వరుసలో ఉన్నారు. సినిమాలు మాత్రమే కాకుండా తమన్నా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కార్యక్రమాలలోనూ చురుగ్గా పాల్గొంటుంది. అంతేకాకుండా పలు బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే తమన్నా ఓ వివాదంలో చిక్కుకున్నారు. కర్ణాటక ప్రభుత్వానికి చెందిన ఓ బ్రాండ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించి చిక్కుల్లో పడ్డారు. తమన్నా కర్ణాటక ప్రభుత్వానికి చెందిన మైసూర్ శాండల్ సోప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు.

దీంతో కర్ణాటకలోని ప్రజలు తమన్నపై సీరియస్ అవుతున్నారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఏ హీరోయిన్లు బ్రాండ్ అంబాసిడర్లుగా పనికి రారా.... వేరే రాష్ట్రానికి చెందిన అమ్మాయిని తీసుకువచ్చి అంబాసిడర్ గా నియమిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం పైన ప్రభుత్వం స్పందిస్తూ ఇతర రాష్ట్రాలలో మార్కెట్ విస్తరణ కోసమే తమన్నాను ఎంపిక చేసినట్లుగా స్పష్టం చేశారు. ప్రభుత్వం ఈ విషయంపై స్పందించిన అనంతరం కర్ణాటక ప్రజలు సైలెంట్ అయ్యారు. ఈ విషయం పైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: