ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రస్తుతం వార్ 2 లో నటిస్తూ ఉన్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి  టీజర్ కూడా విడుదల చేయగా అభిమానులను బాగానే ఆకట్టుకున్న కొంతమందిని నిరుత్సాహపరిచిందనే విధంగా తెలియజేశారు. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ టీజర్ లో కియారా అద్వానీ బికినీనే హైలెట్గా నిలిచిందని చెప్పవచ్చు. ఎన్టీఆర్ ని మునుపెన్నడూ చూడని విజువల్స్ లో కనిపించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న వార్ 2  సినిమా విషయంలో ఎవరెవరి రెమ్యూనరేషన్ ఎంత ఉందనే విషయం ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతున్నది.



వార్ 2 సినిమాతో బాలీవుడ్ లోకి ఎన్టీఆర్ అడుగు పెట్టారు ఇందులో కూడా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర అయినప్పటికీ కూడా ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ చిత్రం కోసం 60 కోట్ల వరకు తీసుకున్నారని విధంగా కథలు వినిపిస్తున్నాయి. ఇందులో ఒక స్పై ఏజెంట్గా కనిపించబోతున్నారని సమాచారం..RRR చిత్రం కోసం ఎన్టీఆర్ 45 కోట్లు తీసుకోగా ఇప్పుడు వాటికి మించి రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. వార్ 2 లో హృతిక్ రోషన్ కంటే ఎన్టీఆర్ పాత్ర ఎక్కువగా ఉంటుందని అందుకే రెమ్యూనరేషన్ ఎక్కువగా తీసుకున్నారని సమాచారం.



2019లో వార్ పాత్రకు ఇది కొనసాగింపుగా వార్ 2 ఉండబోతోంది. వార్ 2 కి హృతిక్ రోషన్ 48 కోట్లు తీసుకున్నారని బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా యష్ రాజు ఫిలిమ్స్ బ్యానర్ పైన ఇప్పటికే ఎన్నో చిత్రాలు నిర్మించారు..అందుకే గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా పారితోషకం ఇచ్చినట్లుగా తెలుస్తోంది..అలాగే కియారా అద్వాని  బికినీలో కనిపించడం కోసం భారీగానే తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.సుమారుగా 15 కోట్ల రూపాయల వరకు తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.ఈమె ఇందులో ఏజెంట్ కబీర్ కి లవర్ గా కనిపించబోతోంది.ఆగస్టు 14 రిలీజ్ కాబోతోంది వార్ 2.

మరింత సమాచారం తెలుసుకోండి: