ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఒకరంటే ఒకరికి అస్సలు పడకుండా వస్తుంది . మరీ ముఖ్యంగా కొంతమంది తమ మధ్య ఉన్న విభేదాలను పబ్లిక్ గా ఓపెన్ గా సోషల్ మీడియా ద్వారానే బయటపెడుతూ వస్తున్నారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ మధ్య ఎంత హిట్ పెంచేసింది అన్న విషయం అందరికీ తెలిసిందే . ఆ ఇద్దరు హీరోలు బాగానే ఉన్నా ఫ్యాన్స్ మాత్రం ఓ స్థాయిలో సోషల్ మీడియాలో బూతులు తిట్టుకుంటూ ఫ్యామిలీ పరంగా పర్సనల్గా అటాక్ చేసిన కామెంట్స్ చేశారు .


కానీ ఈ వార్ గురించి అటు మెగా ఫ్యామిలీ గాని ఇటు అల్లు ఫ్యామిలీ గాని ఏ విధంగా స్పందించట్లేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ.. వాళ్ళ సినిమా షెడ్యూల్స్ వాళ్ళు కంప్లీట్ చేసుకుంటూ అకౌంట్ లో హ్యాపీగా రెమ్యూనిరేషన్ వేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు . అయితే ఎట్టొచ్చి మధ్యలో నలిగిపోయేది ఫ్యాన్స్. అలా మరోసారి ఓ స్టార్ మాట్లాడిన మాటలు హాట్ గా ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో హీరో ధనుష్ మాట్లాడిన మాటలు బాగా హీట్ పెంచేసాయి . ఈ మధ్యకాలంలో ధనుష్ పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయ్యింది. అదేవిధంగా ట్రోలింగ్కి గురైంది.  ఓ టాప్ మోస్ట్ హీరోయిన్ ధనుష్ పై తీవ్రంగా విరుచుకుపడింది. అది అందరికీ తెలిసిందే.  అయితే ధనుష్ ఏ విధంగా ఆమెపై నెగిటివ్ కామెంట్స్ చేయలేదు . కానీ ఇప్పుడు మాత్రం స్టేజ్ ఎక్కి స్పీచ్ ఇవ్వడానికి మైక్ పట్టుకొని కొన్ని ఘాటు కౌంటర్లు వేశారు .



మనకు తెలిసిందే ధనుష్ - శేఖర్ కమ్ముల దర్శకత్వంలో "కుబేర" సినిమాలో నటించాడు . ఈ సినిమా జూన్ 20వ తేదీ గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే చెన్నైలో ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.  ఈ ఈవెంట్లో ధనుష్ చాలా గొప్పగా అదేవిధంగా తనపై నిందలు వేస్తున్న ఒక బ్యాచ్ కి ఇచ్చి పడేసారు . ఎవరైతే నా మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళు నన్ను ఏమి చేయలేరు .. నా సినిమా రిలీజ్ అవుతుంది అంటే చాలు కొన్ని బ్యాచులు కాచుకుని వెయిట్ చేస్తాయి. నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి వెయిట్ చేస్తుంటాయ్.. నన్ను ఏమీ చేయలేదు ఆ బ్యాచ్.. ఎందుకంటే నాకు నా అభిమానులు ఉన్నారు ".



"దారి తీయలేకుండా చీకట్లో వెళ్తున్నప్పుడు.. ఒక అదృష్ట శక్తి మన చేతిని పట్టుకొని నడిపిస్తుంది అని అంటూ ఉంటారు . అది నేను నమ్ముతాను అలా నన్ను పట్టుకుని నడిపించే వారే అభిమానులు ..వారు అభిమానులు మాత్రమే కాదు 23 ఏళ్ల పాటు నాతో కలిసి నడుస్తున్న నా కుటుంబం .. ఇక ఆ బ్యాచ్ పక్కకి వెళ్లి అడుక్కోండి.. సర్కస్ ఫీట్లు ఆపండి.. నా అభిమానులు అంద నాకు ఎప్పుడూ ఉంటుంది . మీరు ఒక్క ఇటుక కూడా కదల్చలేరు" అంటూ కూసింత ఘాటుగానే ఎవరైతే తన పట్ల నెగిటివిటీ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళకి ఇచ్చి పడేశారు. అయితే ధనుష్ ఈ విధంగా స్టేజి పైకి ఎక్కి అగ్రీసివ్గా మాట్లాడిన సందర్భాలు చాలా రేర్.  చాలామంది ఇది ఆ హీరోయిన్ పైనే కౌంటర్ వేశాడు అంటూ మాట్లాడుతున్నారు.  అంతేకాదు ఒకే ఒక్క ముక్కలో ధనుష్ "ఏం పీక్కుంటావో పీక్కో పోవే" అన్నట్లు మాట్లాడరని ఇక హీరోయిన్ అన్ని మూసుకొని ఒక మూల కూర్చుంటే బెటర్ అంటూ ధనుష్ ఫ్యాన్స్ కోపంగా  రియాక్ట్ అవుతున్నారు.  ధనుష్ నిజంగా నా హీరోయిన్ నే  టార్గెట్ చేసి మాట్లాడారా ..?లేకపోతే దీని వెనక ఎవరైనా వేరే వ్యక్తులు ఉన్నారా..? సోషల్ మీడియాలో మాత్రం ఆ హీరోయిన్ ని దారుణాతి దారుణమైన బూతు పదాజాలంతో ట్రోల్ చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: