సినిమా ఇండస్ట్రీ లో ఒక హీరో నటించిన మూవీల కంటే కూడా ఇద్దరు , ముగ్గురు హీరోలు కలిసి ఒక సినిమాలో నటించినట్లయితే ఆ మూవీ పై ప్రేక్షకుల్లో సాధారణంగా అంచనాలు కాస్త ఎక్కువగా ఉంటూ వస్తాయి. అలాంటి మూవీస్ కి ఓపెనింగ్స్ కూడా పెద్ద స్థాయిలో వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే అలాంటి సినిమాలకు మంచి టాక్ కనుక వచ్చినట్లయితే ఆ మూవీలు భారీ కలెక్షన్లను వసూలు చేసే అవకాశాలు కూడా ఎక్కువ శాతం ఉంటాయి. ఇకపోతే తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , మంచు మనోజ్ , నారా రోహిత్ హీరోలుగా భైరవం అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ కి విజయ్ కనకమెడల దర్శకత్వం వహించాడు. తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన ముగ్గురు హీరోలు నటించిన సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ మూవీ పెద్ద స్థాయిలో కలెక్షన్లను వసూలు చేయడంలో విఫలం అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన నాలుగు రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ నాలుగు రోజుల్లో ఈ సినిమాకు నైజాం ఏరియాలో 2. 07 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 73 లక్షలు , ఆంధ్ర లో 2.26 కోట్లు , కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా , ఓవర్సీస్ లో కలుపుకొని 70 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా నాలుగు రోజుల్లో 5.76 కోట్ల షేర్ ... 10.05 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి.

ఇక ఈ మూవీ కి 16.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 17 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ లోకి దిగింది. ఈ మూవీ హిట్ స్టేటస్ ను అందుకోవాలి అంటే మరో 11.24 కోట్ల షేర్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్ట వలసి ఉంది. మరి ఈ మూవీ ఇంకా ఎన్ని కలెక్షన్లను వసూలు చేసి ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: