- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే మారుతి డైరెక్షన్లో హర్రర్ కామెడీ సినిమాగా తెరకెక్కుతున్న ది రాజా సాబ్ లో నటిస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న అన్ని సినిమాల కంటే ఈ సినిమా ముందు థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఆ తర్వాత స్పిరిట్ - సలార్ 2 - కల్కి 2 - ఫౌజీ సినిమాలలో నటిస్తారు. ఇదిలా ఉంటే రాజా సాబ్‌ సినిమా కోసం ప్రభాస్ ఒక విషయంలో చాలా తగ్గినట్టు తెలుస్తుంది. రాజా సాబ్ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై టీజీ విశ్వ ప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం ప్రభాస్ తన రెగ్యులర్ రెమ్యూనరేషన్ కాకుండా బాగా తక్కువ తీసుకున్నారట.


మామూలుగా ప్రభాస్ ఒక్కో సినిమాకు 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అయితే ఈ సినిమాకు 100 కోట్లు మాత్రమే తీసుకుంటున్నాడట. ఈ సినిమా కోసం ప్రభాస్ 50 కోట్లు తగ్గించినట్లు తెలుస్తోంది. దీనికి కారణం కూడా ఉంది. గతంలో ప్రభాస్ నటించిన ఆది పురుష్‌ సినిమాతో ఈ నిర్మాత భారీ నష్టాలు చూశారు. అందుకే ఇప్పుడు ఆయన కోసం ప్రభాస్ తన రెమ్యూనరేషన్ తగ్గించినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ప్రభాస్ రాజా సాబ్‌ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్స్ అందుకోవటం ఖాయమని చిత్ర అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: