
సమంతకు నిర్మాణంలో బాగా కలిసి వచ్చింది. మొదటి సినిమా సగం ఆశించిన స్థాయిలో ఆడకపోయిన నిర్మాతగా ఆమెకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. సమంత చేసిన పబ్లిసి టీ తో పోలిస్తే శుభం సినిమా ఇంకా బాగా ఆడాల్సి ఉంది. అయితే ఆమె ను ఈ సినిమా ఎంత మాత్రం నిరాశ పరచలేదు. ఈ క్రమంలోనే ఆమె నిర్మాతగా మరో చిన్న సినిమా చేసేందుకు రెడీ అవుతోంది. దీనికి సంబంధించి రాజు నిడుమోరు ఇప్పటికే ఆమె కు ఓ ప్రాజెక్టు సెట్ చేసి పెట్టినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టును ఆమె అధికారికంగా ప్రకటించబోతోంది. అయితే సమంత నిర్మాతగా తెరకెక్కించిన తొలి సినిమా శుభం కంటే ఈసారి కాస్త పెద్ద బడ్జెట్ సినిమా అవుతోంది ఇది.
మరో మహిళ నిర్మాత మెగా ఫ్యామిలీ వారసురాలు నిహారిక కొణిదెల కూడా నిర్మాతగా చేయబోయే కొత్త సినిమా లాక్ చేసింది. తాజాగా ప్రకటించిన గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డులలో ఆమె నిర్మించిన కమిటీ కుర్రోళ్ళు సినిమాకు అవార్డులు రావడంతో నిహారిక లో ఉత్సాహం పెరిగింది. ఓవైపు నటిగా నటిస్తూనే తన దగ్గర ఉన్న మరో మంచి కథతో సినిమా నిర్మాణం మొదలు పెట్టాలని ఆమె భావిస్తోంది. ఏది ఏమైనా ఇటు నిహారిక . . . అటు సమంతా మరోసారి ప్రొడ్యూసర్లుగా బిజీ కానున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు