నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ అప్పుడు ఉంటుంది ఇప్పుడు ఉంటుంది అని వాయిదా పడుతూ వస్తుంది.కానీ ఆయన సినిమాల్లోకి వచ్చింది లేదు. నందమూరి అభిమానులు స్క్రీన్ పై ఆయన్ని చూసింది లేదు అన్నట్లుగా మారిపోయింది.మొదట బాలకృష్ణ డైరెక్షన్లోనే నందమూరి మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తారని వార్తలు వినిపించాయి. ఆ తర్వాత బోయపాటి శ్రీను, వి వి వినాయక్ కొంతమంది డైరెక్టర్ల పేరు తెర మీద వినిపించాయి. ఇక చివరిగా ప్రశాంత్ వర్మతో నందమూరి మోక్షజ్ఞ మొదటి సినిమా ఉంటుంది అని ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రివీల్ చేశారు. కానీ సడన్ గా ప్రశాంత్ వర్మ బాలకృష్ణ మధ్య విభేదాలు వచ్చి ప్రశాంత్ వర్మసినిమా నుండి తప్పుకున్నట్టు రూమర్స్ వచ్చాయి. కానీ ఫైనల్ గా ప్రశాంత్ వర్మ సినిమా నుండి తప్పుకోలేదని తెలుస్తోంది.

ఈ విషయం పక్కన పెడితే.. బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ జాతకంలో అలా ఉంది అని ఆయన అందులో వేలు పెట్టకపోవడమే బెటర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జ్యోతిష్యుడు వేణు స్వామి. ఆయన ఓ ఇంటర్వ్యూలో మోక్షజ్ఞ జాతకం గురించి మాట్లాడుతూ.. నందమూరి మోక్షజ్ఞ కి తండ్రి తాత లాగా రాజకీయాలు అయితే కలిసి రావు.ఆయన రాజకీయాల్లోకి వెళ్లకపోవడమే బెటర్. కానీ సినిమాల్లో మాత్రం స్టార్ హీరో అవుతారు. సినిమాల్లోకి రావడం కాస్త ఆలస్యం అవుతుంది కావచ్చు. కానీ ఒక్కసారి సినిమాల్లోకి వెళ్తే ఆయన తండ్రి తాత లాగే పేరు తెచ్చుకుంటారు.. మోక్షజ్ఞ కి సినిమాల్లో ఉన్నంత సక్సెస్ రాజకీయాల్లో ఉండదు.

అందుకే రాజకీయాల్లో ఆయన వేలు పెట్టకపోవడమే మంచిది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వేణు స్వామి. అయితే నందమూరి కుటుంబం అంటే కేవలం సినిమాలకు మాత్రమే కాదు రాజకీయాలకు కూడా పెట్టింది పేరు.అలాంటి రాజకీయాల్లోకి బాలకృష్ణ వచ్చి సక్సెస్ అయ్యాడు. ఓవైపు సినిమాల్లో కూడా సక్సెస్ అయ్యాడు.కానీ ఆయన కొడుకు మాత్రం కేవలం సినిమాల్లోనే సక్సెస్ అవుతాడు.రాజకీయాల్లో సక్సెస్ అవ్వడు అని వేణు స్వామి చెప్పారు. మరి మోక్షజ్ఞ తండ్రి బాటలోనే సినిమాలు రాజకీయాలు అంటూ వెళ్తారా లేక సినిమాల్లోనే కొనసాగుతారా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: