
ఆ టాలీవుడ్ హీరో ఒకే ఒక కౌగిలింత కోసం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 22 ఏళ్ళు వెయిట్ చేశాడట. ఒక్క కౌగిలింత కోసం 22 ఏళ్ళు వెయిట్ చేసిన హీరో ఎవరు ? ఎందుకు ఆయన కౌగిలించుకుంది ఎవరిని ? అన్నది సహజంగా ఆసక్తికరమే. ఆ హీరో ఎవరో కాదు ? టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఇది కన్నప్ప సినిమా మేటర్. మంచి విష్ణు తన కన్నప్ప సినిమా ప్రచారం వేగవంతం చేశారు. ఈ సినిమా ప్రచారం కోసం మంచు విష్ణు బాగా కష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే రజనీకాంత్‌కు తన సినిమా చూపించారు. సినిమా చూసిన వెంటనే రజనీకాంత్ పరవశించాడట. వెంటనే కౌగిలించుకున్నాడట .. ఆ హగ్ కోసమే తాను 22 ఏళ్లు వెయిట్ చేశానని మంచు విష్ణు చెపుతున్నాడు.
దీనిపై మంచు విష్ణు స్పందిస్తూ రజనీ కాంత్ ఈ ఒక్క హగ్ కోసం తాను ఏకంగా 22 ఏళ్లు గా వెయిట్ చేశానని చెపుతున్నారు. ఈ సినిమా రజనీ కాంత్ గారికి బాగా నచ్చింది .. చూసిన వెంటనే హగ్ చేశారు.. దీని కోసమే తాను ఇన్నేళ్ల పాటు వెయిట్ చేశానని చెపుతున్నారు. ఈ నెల 27 న శివుడి మహత్యాన్ని ప్రపంచం మొత్తం చూస్తుందని కూడా అన్నారు. సినిమా లో కొన్ని అంశాలపై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు వార్తలు వస్తున్నా దీనిపై ఇంకా మంచు విష్ణు స్పందించ లేదు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు