పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా హరిహర వీరమల్లు అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... ఈ మూవీ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రారంభం అయింది. ఆ తర్వాత ఈ సినిమా దర్శకత్వ భాద్యతల నుండి క్రిష్ తప్పుకోవడంతో జ్యోతి కృష్ణ అనే దర్శకుడు ఈ మూవీ కి సంబంధించిన మిగిలిన భాగం షూటింగ్ను పూర్తి చేశాడు. కొన్ని రోజుల క్రితం ఈ సినిమాను జూన్ 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ వాయిదా వేశారు.

ఇది ఇలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన నిర్మాతలలో సూర్య దేవర నాగ వంశీ ఒకరు. ఈయన పవన్ కళ్యాణ్ ను అత్యంత అభిమానిస్తూ ఉంటాడు. పవన్ పై తనకున్న అభిమానాన్ని నాగ వంశీ మరోసారి చాటుకున్నాడు. నాగ వంశీ , విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన కింగ్డమ్ అనే సినిమాను నిర్మిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. అయినా కూడా ఈ సినిమా విడుదల తేదీని నాగ వంశీ ప్రకటించడం లేదు.

సినిమా విడుదల తేదీని నాగ వంశీ ప్రకటించకపోవడానికి ప్రధాన కారణం హరిహర వీరమల్లు సినిమా విడుదల తేదీని ప్రకటించిన తర్వాత ఆ సినిమాకు కింగ్డమ్ సినిమాకు మధ్య చాలా ఎక్కువగా గ్యాప్ ఉండేలా నాగ వంశీ చూసుకోవాలి అని ఇటు హరిహర వీరమల్లు సినిమాకు గాని , అటు కింగ్డమ్ సినిమాకు గాని ఎలాంటి ప్రమాదం జరగకుండా ఏ మూవీ కలెక్షన్లపై ఏ మాత్రం ఎఫెక్ట్ పడకుండా చూడాలి అని నాకు వంశీ "కింగ్డమ్" సినిమా విడుదల తేదీని హోల్డ్ లో పెట్టినట్లు తెలుస్తోంది. దీనితో నాక వంశీ , పవన్ పై ఉన్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: