
ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. మరీ ముఖ్యంగా ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్అవుతూ ఉండడం గమనార్హం. కాగా చిరంజీవి నెక్స్ట్ సినిమా ఏ డైరెక్టర్ తో కమిట్ అయ్యాడు..?? అనే విషయం వెరీ ఇంట్రెస్టింగ్గా మారింది. ప్రెసెంట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న చిరంజీవి .. ఆ తర్వాత వెంటనే బోయపాటి శ్రీనుకి ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది . ప్రసెంట్ బాలయ్య అఖండ 2 సినిమాతో బిజీ బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా రిలీజ్ అయిన అనంతరం బోయపాటి చిరు స్క్రిప్ట్ పై ఫోకస్ పెడతారట.
పూర్తికావడానికి ఎలా లేదన్న మూడు నాలుగు నెలల సమయం పడుతుంది అంటున్నారు మేకర్స్ . ఈ లోపు మెగా 157 సినిమా రిలీజ్ అయిపోతుంది. ఆ తర్వాత చిరు - బోయపాటి కాంబో కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు . సెట్స్ పైకి వచ్చేయొచ్చు . ఈ ప్రాజెక్ట్ సెట్ చేసుకోవడానికి అన్ని రకాలుగా వెసులుబాటు ఉంటుంది . కాకపోతే చిరంజీవి - బోయపాటిని ఎలా హైలెట్ చేస్తాడు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్. సాధారణంగా బోయపాటి మాస్ డైరెక్షన్ బాలయ్యకు తప్పితే వేరే ఎవరికీ సూట్ అవ్వదు. చిటికె వేస్తే కుర్చీ వచ్చేస్తుంది . తొడలు కొడితే ట్రైన్లు పేలిపోతాయి . ఇలాంటి సీన్స్ బాలయ్య చూస్తే బాగుంటుంది . కానీ వేరే హీరోలు చేస్తే అస్సలు బాగోవు . బాలయ్య - రజనీకాంత్ కి తప్పిస్తే ఇలాంటి సీన్స్ మరి ఏ హీరోకి సూట్ అవ్వవు . మరి చిరంజీవితో అలాంటి ఫీట్లు చేయిస్తాడో..?? ఏమో ..?? చిరంజీవి - బోయపాటి సినిమా ఏ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుందో..?? మెగా ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని మరింత వర్కౌట్ చేయాల్సి ఉంటుంది బోయపాటి అంటున్నారు సినీ విశ్లేషకులు . అభిమానులు ఆ తరహా కంటెంట్ మాత్రమే స్వాగతిస్తారు అంటూ కూడా మాట్లాడుతున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో..???