సమంత పరువు ప్రియమణి పోగొట్టిందా.. ఇంతకీ ప్రియమణి సమంతని ఎందుకు అవమానించింది.. వీరిద్దరి మధ్య జరిగిన గొడవ ఏంటి..అని చాలామంది అనుకుంటారు.అయితే  ప్రియమణి సమంత మధ్య ఎలాంటి గొడవ జరగలేదు. కానీ సమంత ముంబైలోని బాంద్రా ఏరియాలో ఉన్న జిమ్ నుండి బయటికి వచ్చిన సమయంలో చాలామంది సమంత ఫోటోలు వీడియోలు తీయడానికి ఎగబడ్డారు. వారందరిపై సమంత కోపగించుకుంటూ స్టాపిట్ గాయ్స్ అంటూ మాట్లాడింది.అయితే ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొట్టడంతో ప్రియమణి గతంలో మాట్లాడిన వీడియోఒకటి వైరల్ అవుతుంది. 

ఆ వీడియోలో సెలబ్రిటీల చుట్టూ ఏర్పోర్ట్ లో తిరిగే కెమెరామెన్లు అందరూ పెయిడ్ ఆర్టిస్టులని, వారికి డబ్బులు ఇచ్చి మరీ హీరో హీరోయిన్లు సెలబ్రిటీలు పెట్టించుకుంటారని, ఎయిర్పోర్ట్ కి హీరో హీరోయిన్స్ రావడంతోనే కెమెరామెన్లు రెడీగా ఉంటారా.. ఉండరు కదా.. వారికి డబ్బులు ఇచ్చి ముందుగానే అలా పెట్టించుకుంటారు. అందుకే హీరో హీరోయిన్లు ఎయిర్ పోర్ట్ లో కనిపించినప్పుడు అక్కడ కెమెరామెన్లు కూడా ఉంటారు. అయితే బాలీవుడ్ లో ఉన్న చాలామంది ఇలాగే డబ్బులు ఇచ్చి వారిని పెట్టించుకుంటారట. అయితే ఈ విషయం నాకు అస్సలు తెలియదు.జవాన్ సినిమా షూటింగ్ సమయంలోనే నాకు ఈ విషయం తెలిసింది. అపరాజ్జి కల్చర్ అనేది పూర్తిగా ట్రాష్.. 

అది చాలామంది సెలబ్రిటీలే డబ్బులు ఇచ్చి పట్టించుకుంటారు. చాలామంది హీరో హీరోయిన్ల పిఆర్ లు వారికి డబ్బులు ఇచ్చి మరీ ఇలా పెట్టిస్తారు. నేను జవాన్ సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు ముంబైకి చెందిన ఓ ఏజెన్సీ లోని వ్యక్తి నాకు ఈ విషయాన్ని చెప్పారు. అయితే అప్పటి వరకు నాకు ఈ విషయం తెలియదు. ముంబైలో ఉన్న సెలెబ్రేటీలందరూ ఇలాగే డబ్బులు పే చేసి వారి వెంటపడేలా చేసుకుంటారు అంటూ ప్రియమణి చెప్పింది. అయితే ప్రియమణి గతంలో భామ కలాపం-2  సినిమా చేసే టైంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పడంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అయ్యి సమంత కూడా ఇలాగే డబ్బులు ఇచ్చి మరీ తన వెంట మనుషుల్ని పడేలా చేసిందా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: