
కొరటాల శివ గత ఏడాది ఎన్టీఆర్ తో `దేవర` సినిమాను తెరకెక్కించే బిగ్ హిట్ కొట్టారు. `దేవర 2` ను పట్టాలెక్కించేందుకు కూడా కొరటాల సిద్ధంగా ఉన్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం ప్రస్తుతం `వార్ 2`, అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో `డ్రాగన్` చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ ఫినిష్ అయ్యేది ఎప్పుడో.. ఎన్టీఆర్ కొరటాలకు డేట్స్ ఇచ్చేది ఎప్పుడో.. అర్థం కాని పరిస్థితి.
అలాగే సుకుమార్ `పుష్ప 2` అనంతరం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా లాక్ చేశారు. చరణ్ 17వ చిత్రాన్ని సుకుమార్ డైరెక్ట్ చేయనున్నారు. అయితే బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ ప్రస్తుతం `పెద్ది` మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ కంప్లీట్ అయ్యేవరకు సుకుమార్ వెయిట్ చేయాల్సిందే. మరోవైపు పాన్ ఇండియా డైరెక్టర్స్ సందీప్ రెడ్డి వంగా, నాగ్ అశ్విన్ ఇద్దరూ ఓకే హీరో కోసం ఎదురు చూస్తున్నారు. అతనే ప్రభాస్. సందీప్ ప్రభాస్ తో స్పిరిట్ మూవీని అనౌన్స్ చేశాడు. నాగ్ అశ్విన్ `కల్కి 2`ను ప్రారంభించేందుకు రెడీ ఉన్నాడు. ప్రభాస్ మాత్రం `రాజా సాబ్`, `ఫౌజీ` చిత్రాలతో బిజీగా ఉన్నాడు.
మారుతి డైరెక్ట్ చేస్తున్న రాజా సాబ్ షూటింగ్ ఆల్మోస్ట్ ఫినిష్ అయింది. డిసెంబర్ 5న ఈ చిత్రం విడుదల కాబోతుంది. అయితే హను రాఘవపూడి రూపొందిస్తున్న ఫౌజీ ఎంతవరకు వచ్చింది అన్నది క్లారిటీ లేదు. ఈ మూవీ పూర్తయ్యాకే స్పిరిట్, కల్కి 2 చిత్రాలు స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక త్రివిక్రమ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో సినిమా అనుకున్నప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం ఆయన విక్టరీ వెంకటేష్ కోసం వెయిట్ చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది.