- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ లో మంచి ఫ్యామిలీ హీరో మంచి విష్ణు భారీ పాన్ ఇండియా సినిమా కన్నప్పతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లలో విష్ణు బిజీ బిజీ గా ఉన్నారు. ఇక మంచు విష్ణు - వెరోనికా దంపతుల జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతుంది. తన భర్త సక్సెస్ లో భార్య సగ భాగం అని విష్ణువు చెబుతున్నారు. తన ప్రతి సక్సెస్ లోనూ వేరోనికా రెడ్డి ఉన్నారని .. అన్ని రకాలుగా తనకు భార్య నుంచి సపోర్టు ఉందని విష్ణు చెబుతున్నారు. వేరోనికా సినిమా రంగానికి సంబంధించిన అమ్మాయి కాదు ... ఆమె ఫ్యామిలీ పొలిటికల్ ఫ్యామిలీ. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు కుమార్తె వేరోనికా రెడ్డి అన్న విషయం తెలిసిందే. తాజాగా వెరోనికా గురించి విష్ణు కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.


ఆమెకు దేశ విదేశాల్లో బోటిక్ కంపెనీలు ఉన్నాయి. ఆమెను మొదటిసారి చూసినప్పుడు ఆమె నవ్వుకే తాను పడిపోయాను అని ... తనే నా జీవిత భాగస్వామి కావాలనుకున్న అని ... మా పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లిందని విష్ణు తెలిపాడు. ఇక నలుగురు పిల్లల బాధ్యత , వ్యాపార లావాదేవీలు ఇతర పనులతో ఆమె ఎంత బిజీగా ఉన్నా నా పర్సనల్ స్టైలిష్ గా కూడా వ్యవహరిస్తుందని చెప్పారు. రెగ్యులర్ డిజైన్స్ పక్కన పెడితే సినిమా ఈవెంట్లకు హాజరైన సమయంలో విష్ణు సంథింగ్ స్పెషల్ గా హైలైట్ అవుతూ ఉంటాడు. కెమెరా క‌ళ్ల‌న్నీ విష్ణు మీదే ఉంటాయి. త‌న భ‌ర్త డ్రెస్సింగ్ కోసం వెరోనికా అంత క‌ష్ట‌ప‌డి ప్లాన్ చేస్తుంద‌న్న మాట‌.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: