రవితేజ హీరోగా వచ్చిన మిస్టర్ బచ్చన్ లో తన నడుము అందాలతో టాలీవుడ్ యువతను కట్టిపడేసిన ముంబై బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే .. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్న ఆమె నటన స్క్రీన్ ప్రజెన్స్‌కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు .. నార్త్ బెల్ట్ లో చేసిన రెండు సినిమాలు పెద్దగా ఆడకపోవటం తో టాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన ఈ బ్యూటీ తన అందంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడంలో బాగా సక్సెస్ అయింది .. ప్రస్తుతం కింగ్డమ్ సినిమా చేస్తున్న ఈ భామ .. స్టార్ బ్యూటీ శ్రీలీలా వదిలేసిన ఆఫర్ ల‌ను తన చేతిలోకి తెచ్చుకుంది .

అక్కినేని అఖిల్ చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న మూవీ లెనిన్ .. రీసెంట్గా హీరోయిన్ శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీలో హీరోయిన్గా ఆమెని ఫిక్స్ చేస్తూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు .. కానీ ఇప్పుడు ఊహించిన విధంగా ఈ సినిమా నుంచి శ్రీలీలా తప్పుకుంది .. అయితే ఇదే కాదు కింగ్డమ్ కోసం రెండేళ్ల క్రితం మొదట శ్రీలీల‌ ని అనుకున్నారు  కానీ అప్పుడు ఆమె ఫుల్ బిజీగా ఉంది .. సినిమాకు ఓకే చెప్పలేకపోయిందని టాక్ .. ఇప్పుడు లెనిన్ విషయం ఎలా ఉంచితే భాగ్యశ్రీ వరుసగా క్రేజీ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటుంది ..

మరో యంగ్ హీరో రామ్ తో కలిసి ఆంధ్రా కింగ్‌ తాలూకా తో పాటు దుల్కర్ సల్మాన్ కు జంటగా కాంతలో కూడా నటిస్తుంది .. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి .  ఇవే కాకుండా ప్రభాస్ , ప్రశాంత్ నిల్ మూవీ కోసం ఈ బ్యూటీని  అప్రోచ్ అయ్యారన్న టాక్ ఉంది .  ఇలా ఇప్పటికే ఈమె లైన్ అప్ తో లక్కీ హీరోయిన్గా అనిపించుకున్న ఈ ముంబై బ్యూటీ కనుక ప్రభాస్ సినిమాలో ఓకే అయితే నిజంగా  అదృష్టం ఈమె వెనకాల వచ్చినట్లే .  ఇక మరి రాబోయే రోజుల్లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయినా ఎలాంటి ఆశ్చర్యపోనక్కర్లేదు..

మరింత సమాచారం తెలుసుకోండి: