- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

మన టాలీవుడ్ లో త్వరలో రిలీజ్ అయ్యే సినిమాలలో పలు సినిమాలపై ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అలాంటి సినిమాలలో క్రేజీ సీక్వెల్స్ లో ఒక‌టి అయిన ఈ నగరానికి ఏమైంది 2 కూడా ఉంది. టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్సేన్ హీరోగా .. దర్శకుడు తరుణ్ భాస్కర్ కలయికలో తెర‌కెక్కిన ఈ సాలిడ్ ఎంటర్టైనర్ సీక్వెల్ కి “ ఈఎన్ఈ రిపీట్ ”  అంటూ పార్ట్ టూ ని రీసెంట్ గానే ఎనౌన్స్‌ చేశారు. అయితే లేటెస్ట్ గానే ఈ సినిమాపై ఓ క్రేజీ న్యూస్ టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్‌లో వైరల్ అవుతుంది. ఈ నగరం వ‌ర‌ల్డ్ లోకి డాకూ మహారాజ్‌ బాలయ్య ఎంటర్ కానున్నట్టు టాక్ వినిపిస్తోంది.


ఈ క్రేజీ సీక్వెల్ సినిమాలో నందమూరి నట‌సింహ బాలకృష్ణ ఓ ఇంట్రెస్టింగ్ కామియో రోల్లో కనిపించే ఛాన్స్ ఉందంటున్నారు. అది కూడా కలిసి ఓ క్రేజీ ఎపిసోడ్ కోసం కొన్ని నిమిషాల పాటు బాలయ్య తెరపై కనిపించి అలరిస్తాడని టాక్. ఇది నిజమైతే కచ్చితంగా ధియేటర్లలో బ్లాస్ట్ అని చెప్పాలి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇక విశ్వక్సేన్ - బాలయ్య మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉంది. బాలయ్య షోకు కూడా విశ్వక్సేన్ వచ్చారు. విశ్వ‌క్‌ నటన , మాస్ స్టైల్ అంటే ఎంతో ఇష్టమని బాలయ్య కూడా చెప్పిన సంగతి తెలిసిందే.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: