డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు , ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ హరిహర వీరమల్లు .. ఎన్నో అడ్డంకులను దాటుకుని ఎట్టకేలకు ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది .. ఇప్పటికే పలుమార్లు వాయిదాలు పడుతూ వచ్చింది అయితే ఈసారి రిలీజ్ అవుతుందని అందరూ ఎంతో నమ్మకంగా చెబుతున్నారు .. అయితే ఇలాంటి సమయంలో ఒక వివాదం ఈ సినిమాని గట్టిగా చుట్టుముట్టింది .. తెలంగాణ పోరాట యోధుడిగా పేరు తెచ్చుకున్న పండుగ సాయన్న జీవిత చరిత్రను వక్రీకరించి సినిమా తీశారు అంటూ బీసీ సంఘాలు విమర్శలు చేస్తున్నాయి .. అలాగే సినిమా రిలీజ్ ను అడ్డుకుందామంటూ ఆ సంఘాల నాయకులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు . తెలుగు రాబిన్‌హుడ్‌గా పేరు తెచ్చుకున్న పండుగ సాయన్న గురించి పెద్దగా ఎవరికి తెలియదు .. ఇంతకీ ఎవరీ పండుగ సాయన్న ? అతనికి హరిహర వీరమల్లు సినిమాకి ఉన్న సంబంధం ఏంటి ? ఎందుకు ఇది వివాదంగా మారింది ? అనే విషయాన్ని ఈ స్టోరీలో తెలుసుకుందాం .


పండుగ సాయన్న 1860 నుంచి 1900 మధ్య కాలానికి చెందినవారు .. ఆ రోజుల్లోనే తెలుగు రాబిన్‌హుడ్‌గా ఆయన పేరు తెచ్చుకున్నారు .. అలాగే సాయన్న గ్రామీణ క్రీడల్లో ఎంతగానో ఆరితేరిన‌వాడు .. అలాగే ఎంతో బలవంతుడు .. 20 కేజీల గుండుగను అవలీలగా ఒక చేత్తో ఎత్తేసేవాడు .. ఎద్దుల బండిని కూడా ఒక చేత్తోనే లేపి విసిరేవాడు .. ప్రజల నుంచి దోచుకుంటున్న దొరలు , దేశ్‌ముఖ్‌లు , అధికారులు సంపన్నులను దోచుకుని పేదలకు పంచుపెట్టేవారు .. అలా పేదల పాలిట‌ రాబిన్‌హుడ్‌గా పేరు తెచ్చుకున్నప్పటికీ ఆదిపత్య వర్గాలు మాత్రం అతనిపై బందిపోటు అనే ముద్ర వేసి పెట్టాయి .. అయితే పేదవారి దృష్టిలో మాత్రం అతను ఒక  రాబిన్‌హుడ్  అయినప్పటికీ .. అతని జీవిత లక్ష్యం మాత్రం వేరు .. అప్పటి నిరంత నిజాం అధికారులను ఎదిరించి ప్రశ్నించాడు .. వారిని ఎదిరించి తన సొంత పాలన వ్యవస్థను స్థాపించుకున్నాడు .. అలాగే ఒక సరికొత్త బహుజన సామ్రాజ్యాన్ని స్థాపించడానికి ప్రయత్నం కూడా చేశాడు సాయన్న .. అయితే ఇవన్నీ చూసి తట్టుకోలేక దేశముఖ్‌లు , కరణం పటేళ్లు, భూస్వాములు అప్పటి నిజాం ప్రభువుతో కుమ్మక్కై సాయన్నను దారుణంగా హత్య చేశారు .

 

ఇప్పటికీ పండుగ సాయన్న చనిపోయిన రోజున వేలాది మంది ఆయన సమాధి దగ్గరికి వచ్చి నివాళులు కూడా అర్పిస్తారు .. అలాగే జయంతి ఉత్సవాలు కూడా జరుపుతారు .. ఇలా ఇప్పటికీ అతని చరిత్రను సజీవంగా ఉంచుతుంది సంచార జాతులు , దళిత బహుజన కళాకారుల కంఠాలే , ఇక వీరు ఊరోరా తిరుగుతూ సాయన్న చరిత్ర‌ను గానం చేశారు .. అలాగే మహబూబ్‌నగర్‌కు  చెందిన బేక్కం జనార్ధన్ పండుగ సాయన్న పై ఒక నవల కూడా రాశారు .. చరిత్రక ఆధారాలు తక్కువగా లభించే ఈ కథను దొరికిన అన్నవాళ్లతోనే ఎంతో ఉన్నతంగా రచించారు .అయితే ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా సంగతి కి వస్తే .. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ను బట్టి పండుగ సాయన్నకు సంబంధించిన కొన్ని పోలికలు ఈ సినిమాల్లో కనిపిస్తున్నాయి .. ధనవంతులను దోచుకుని పేదలకు సాయం చేసే లక్ష్యంతోనే వీరమ‌ల్లు పాత్ర సినిమాలో ఉంటుందని అర్థమవుతుంది .. అలాగే నిజాం నవాబుల నిరంకుశ పాలనతో పాటు కోహ్నూర్ వజ్రాన్ని కూడా ఈ సినిమాలో చూపించారు .. అలాగే ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే స్టోరీ మొత్తం కోహునూర్ వజ్రం చుట్టూనే ఉంటుందని కూడా తెలుస్తుంది .. అలాగే ఈ వజ్రం కోసం గోల్కొండ నుంచి ఎనిమిదవ వాడిగా వీరమాల్లు ఢిల్లీ బయలుదేరుతాడు .. ఇక అతను ఆ వజ్రాన్ని సాధించాడా లేదా అనేది స్టోరీగా తెలుస్తుంది.

 

అయితే ఇక్కడ బీసీ సంఘాలు విమర్శలు చేస్తున్నట్టుగా ఇందులో పండుగ సాయన్నకు సంబంధించిన ఎలాంటి కీలక సన్నివేశాలు అంశాలు ఏవి ఉన్నట్టుగా లేదు .. అలాగే సంపన్నులను దోచుకుని పేదలకు పెట్టే రాబిన్‌హుడ్‌ తరహా సన్నివేశాలు తప్ప వీరమల్లులో సాయన్న కు సంబంధించిన ఎలాంటి అంశం లేదు .  అలాగే అతని జీవిత చరిత్రతోనే ఈ సినిమా వస్తున్నట్టుగా ప్రచారం జరగడమే ఈ విదానికి ప్రధాన కారణం కూడా అని అంటున్నారు .. అలాగే వీరమల్లు అనేది ఒక కల్పిత పాత్ర అని ఇప్పటికే సినిమా యూనిట్ ప్రకటించింది .. చరిత్ర పోక‌డ‌లు ఉన్న ఒక జానపద సినిమాగా హరిహర వీరమల్లు రాబోతుంది .. అయితే ఇప్పుడు ఈ సినిమాపై వచ్చిన వివాదం వల్ల విడుదలకి ఎలాంటి అడ్డంకులు ఉండకపోవచ్చు .. ఇప్పటికే బీసీ సంఘాల నాయకులతో చర్చలు జరిపి సినిమాకి సంబంధించిన నిజాలు వారికి వివరించడం ద్వారా ఎంతో ఈజీగానే ఈ సమస్య పరిష్కారం అవుతుందని అభిప్రాయం కూడా అందరిలో ఉంది ..

మరింత సమాచారం తెలుసుకోండి: