తెలుగు సినీ నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బోడప్పల్‌లోని ఆర్బీఎం హాస్పిటల్‌లో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. రెండు కిడ్నీలు పాడవడంతో వైద్యులు అత్యవసరంగా కిడ్నీ మార్పిడి అవసరమని సూచించారు. అయితే ఇప్పటికే డయాలసిస్ చికిత్స కోసం ఉన్నదంతా ఖర్చు పెట్టేయగా.. ఆపరేషన్ కు అవసరమయ్యే డబ్బులు లేక అతని కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే తమను ఆదుకోవాలంటూ ఫిష్ వెంకట్ సతీమణి సువర్ణ, కుమార్తె స్రవంతి వేడుకున్నారు.


అయితే రెండు రోజుల క్రితం పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్ వెంకట్ ఆపరేషన్ కోసం రూ. 50 లక్షలు డొనేట్ చేసినట్టు విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాతే అది ఫేక్ అని స్పష్టమైంది. ఇలాంటి త‌రుణంలో ఫిష్ వెంక‌ట్ ను ఆదుకునేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం ముందుకు వ‌చ్చింది. తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి స్వ‌యంగా సోమవారం ఆసుపత్రికి వెళ్లి వెంక‌ట్ ను ప‌రామ‌ర్షించారు. అలాగే వెంక‌ట్ చికిత్స ఖ‌ర్చు ప్ర‌భుత్వం భ‌రిస్తుంద‌ని అత‌ని కుటుంబానికి శ్రీ‌హ‌రి హామీ ఇచ్చారు.
ఇక‌పోతే తాజాగా టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ కూడా ఫిష్ వెంక‌ట్ కు అండంగా నిలిచారు. రూ. 2 ల‌క్ష‌లు ఆర్థిక సాయాన్ని అందించారు. అందుకు సంబంధించిన చెక్ కు త‌న టీమ్ ద్వారా ఫిస్ వెంక‌ట్ కుటుంబానికి అంద‌జేశారు. కాగా, పెద్ద పెద్ద హీరోలే వెంక‌ట్ విష‌యంలో ఏం ప‌ట్ట‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తుంటే.. విశ్వ‌క్ సేన్ మాత్రం ముందుకు వ‌చ్చి త‌న వంతు స‌హాయం చేయ‌డం నిజంగా గ్రేట్ అంటూ నెటిజ‌న్లు  ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: