
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలలో మోస్ట్ అవైటెడ్ పీరియాడికల్ డ్రామా హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రిలీజ్ అవుతున్న తొలి సినిమా కావడంతో వీరమల్లు సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ఈ సినిమాను హిస్టారికల్ సినిమాగా తెరకెక్కగా ... క్రిష్ - ఎం జ్యోతి కృష్ణ ఇద్దరు సంయుక్తంగా డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వీరమల్లు అనే పవర్ఫుల్ పాత్రలో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. వరల్డ్ వైడ్గా జులై 24న గ్రాండ్గా రిలీజ్ చేసినందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమా కోసం ఓవర్సీస్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. యూఎస్ బాక్సాఫీస్ దగ్గర వీరమల్లు ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తితో ఉన్నారు.
వీరి ఎదురు చూపులకు పులిస్టాప్ పెడుతూ అక్కడ బాక్సాఫీస్ దగ్గర హరిహర వీరమల్లు టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. యూఎస్ లో ఈ సినిమా 23న ప్రీమియర్ల రూపంలో విడుదల కానుంది. ఇక సినిమాను తొలిరోజు చూసేందుకు ప్రేక్షకుల ఆసక్తితో ఉండడంతో ఈ సినిమా ఓవర్సీస్ లో అడ్వాన్స్ టికెట్ బుకింగ్ స్వరూపంలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో బాబీ వీడియోల్ విలన్ పాత్రలో నటిస్తుండగా కీరవాణి సంగీతం అందించారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు