
రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన కూలి సినిమాలో నాగార్జున విలన్ క్యారెక్టర్ లో కనిపించాడు. ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది . ఈ సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు అక్కినేని అభిమానులు . అయితే సింగిల్ హీరోగా నాగార్జున తెరపై కనిపిస్తే చూడాలి అనేది అక్కినేని అభిమానుల కోరిక . ఆ కోరికను కూడా తీర్చేయడానికి సిద్ధపడిపోతున్నాడు నాగార్జున . త్వరలోనే తమిళ్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడు . తమిళంలో సూపర్ డూపర్ హిట్ "అయ్య్త్తి" అనే సినిమాను నాగ్ హీరోగా కార్తీక్ డైరెక్టర్గా రీమేక్ చేయబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది.
అయితే ఇది సూట్ అవుతుందా..? నాగ్ థియేటర్స్ కి జనాలను రప్పిస్తాడా..? అని అందరికీ సందేహం వస్తుంది . దానికి కారణం ఈ సినిమా కథ . ఒక ముక్కలో చెప్పాలి అంటే సినిమా కథ చాలా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. ఇది స్టార్ ఇమేజ్ ఉన్న హీరో చేతగినది కాదు . ఆఅయ్యత్తి" కథ గురించి మాట్లాడుకోవాలి అంటే నార్త్ ఇండియా నుంచి ఒక ఫ్యామిలీ తమిళనాడుకు వస్తుంది.. అక్కడ కొన్ని కారణాల చేత వాళ్ళు ఇల్లు అద్దెకు తీసుకుంటారు. ఆ టైంలో కారుకు ప్రమాదం జరుగుతుంది . దానివల్ల తల్లి చనిపోతే తండ్రి కూతురు కలిసి తన మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకెళ్లడానికి ఇబ్బంది పడతారు . సినిమా స్టోరీ అంత అదే . ఒక కార్ డ్రైవర్ వాళ్ళకి ఎలా సహాయపడతారు ..? అనేది కొస మెరుపు. ఎమోషనల్ డ్రామా ఇలాంటి ఫుల్ ఎమోషనల్ డ్రామా నాగార్జున కి సూట్ అవుతుంది అని మాత్రం ఫ్యాన్స్ అనుకోవడం లేదు. పైగా తెలుగు ఆడియన్స్ కి ఇలాంటి సినిమాలు కనెక్ట్ అవ్వవు. ఇలాంటి ఒక కాన్సెప్ట్ చూస్ చేసుకుని నాగార్జున రాంగ్ స్టెప్ తీసుకున్నాడు ఏమో అంటున్నారు అభిమానులు . కొంతమంది ఇలాంటి కథతో నాగార్జున కనిపిస్తే ఒక్క అభిమాని అయిన థియేటర్ కి వెళ్లి సినిమా చూస్తాడా..? అన్న సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. కానీ నాగార్జున తలచుకుంటే ఏదైనా సాధ్యమే . మన్మధుడు లాంటి సినిమా తీసిన నాగార్జున ఆ తర్వాత ఎన్ని భక్తి చిత్రాలలో నటించి సూపర్ డూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు అందరికీ తెలుసు...!!